E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?
Advertisement

Bigg Boss 10 Chaitra Rai: బిగ్ బాస్ 10తెలుగు సీజన్ కార్యక్రమం ప్రసారమయ్యే ఒక వారం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీరియల్ నటి చైత్ర రాయ్(Chaitra Rai) పాల్గొన్నారు. అయితే ఈమె సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్10 (Bigg Boss 10)లో చివరి వరకు కొనసాగుతుందని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా చైత్ర మొదటి వారమే ఎలిమినేట్ (Elimination)అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా చైత్ర మొదటి వారమే ఎలిమినేట్ కావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య వ్యక్తం చేశారు.

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ…

ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత చైత్ర రాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్కడ కూడా ఎలాంటి వీడియోలను షేర్ చేయలేదు. అలాగే తన ఎలిమినేషన్ గురించి కూడా ఈమె ఎక్కడ ఎలాంటి ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మొదటిసారి చైత్ర సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో భాగంగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.

ఎలిమినేషన్ పై స్పందించని చైత్ర…

Advertisement

అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని మీరు అనుకున్న పనులు అన్నింటినీ ఆ విగ్నేశ్వరుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా బిగ్ బాస్ నుంచి ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన చైత్ర రాయ్ తన ఎలిమినేషన్ కి సంబంధించి ఏదైనా ఒక వీడియో చేస్తుందేమోనని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి, తన ఎలిమినేషన్ గురించి ఏదైనా మాట్లాడుతారు అనుకుంటే బిగ్ బాస్ ప్రస్తావన తీసుకురాకుండా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన మొదటి వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక చైత్ర కెరియర్ విషయానికి వస్తే ఈమె కన్నడ నటి అయినప్పటికీ అష్టా చమ్మా అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మొదటి సీరియల్ తోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్న ఈమె అనంతరం తెలుగులో పలు సీరియల్స్ లో నటించే అవకాశం అందుకున్నారు. ఇలా తెలుగు, కన్నడ సీరియల్స్ చేస్తూ ఎంత బిజీగా ఉన్న చైత్ర రాయ్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు కానీ ఈమె మొదటి వారమే ఎలిమినేట్ కావడం నిరాశకు గురి చేసింది.

Also Read: హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

Related News

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×