Bigg Boss 10 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ప్రస్తుతం పదో సీజన్ ని ప్రారంభించింది.. ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సీజన్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అలాగే విమర్శలను కూడా అందుకుంటూ వస్తుంది.. సెలబ్రిటీలతోపాటు కామనర్స్ కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ మరి ప్రతి ఒక్క టాస్క్ ని పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన టాస్కులు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఎక్కువగా సీరియల్ యాక్టర్స్ హౌస్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరొక సీరియల్ యాక్టర్ కూడా హౌస్ లోకి రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? బిగ్ బాస్ ఆమెని హౌస్ లోకి తీసుకురావడానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈసారి కొత్తవాళ్ళని తీసుకొచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా అయితే షో లేదని టాక్ వినిపిస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నా ప్రేక్షకులకు ఇది కాస్త చప్పగానే ఉన్నట్లు తెలుస్తుంది. నిజంగానే బిగ్ బాస్ లో ఈసారి పెద్దగా స్టార్టింగ్ నుంచి గొడవలు అత్తగా జరగలేదు కానీ ఏదో చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు కనిపిస్తుంది. హౌస్ లోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జంటలుగా ఎవరు కనిపించలేదు కాబట్టి.. గుప్పెడంత మనసు హీరోయిన్ వసుధార అలియాస్ రక్షగౌడ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఓ వార్త అయితే ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కెర్లు కొడుతుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే రక్ష గౌడ హౌస్ లోకి ఎంట్రీస్తుందా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న గుప్పెడంత మనసు రిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో చేసిన ఒక్క సీరియల్ తోనే ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసాడు ముఖ్యంగా అమ్మాయిలు రిషి సార్ లాంటి అబ్బాయి దొరికితే బాగుండు అని అభిప్రాయపడుతూ ఉంటారు.. అయితే ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముఖేష్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఈ సీరియల్ తర్వాత మరొక సీరియల్ లో కనిపించలేదు కానీ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసే ప్రయత్నాలు కూడా చేశాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖేష్ ప్రస్తుతం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఈయనకు వారానికి రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది అని తెలుస్తుంది.. ఈ లెక్కన అతను వంద రోజులు వెనక హౌస్ లో ఉంటే భారీగానే సంపాదిస్తాడని జనాలు అభిప్రాయపడుతున్నారు..
Also Read :సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..