E-Paper
Advertisement

Congress Second List : సెకండ్ లిస్ట్ పై కాంగ్రెస్ కసరత్తు.. అందరి చూపు ఆ సీటు వైపు

Congress Second List : సెకండ్ లిస్ట్ పై కాంగ్రెస్ కసరత్తు.. అందరి చూపు ఆ సీటు వైపు
Advertisement

Congress Second List : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో లిస్టుపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న హస్తం పార్టీ… ఆదివారం మరో 50 మందితో సెకండ్‌ లిస్టు ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. తొలి జాబితాలో వలసలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన నేతలు.. మైనంపల్లి హన్మంతరావుతో పాటు మైనంపల్లి రోహిత్‌కు కూడా టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇక రెండో లిస్టు ప్రకటించనున్న నేపథ్యంలో కామారెడ్డి టికెట్‌పై ఉత్కంఠ నెలకొంది. గతంలో షబ్బీర్‌ అలీ ఈ స్థానం నుంచి పోటీ చేయగా.. ఇప్పుడు కేసీఆర్‌ను ఎదుర్కొనే క్యాండిడేట్‌ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. షబ్బీర్‌ అలీ స్థానంలో మదన్‌మోహన్‌రావు లేదా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కానీ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Advertisement

రెండో అభ్యర్థుల లిస్ట్ పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోసారి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంకానుంది. ఈ క్రమంలో రేవంత్‌ హస్తినకు వెళ్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. రేపు సెకండ్‌ లిస్టును ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 60 మంది అభ్యర్థులతో లిస్ట్‌ రెడీ అయినట్టు సమాచారం. దీంతో రెండో జాబితాలో టిక్కెట్లు ఎవరెవరికి దక్కాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హై కమాండ్‌ నిర్ణయంపై ఆశవహుల్లో టెన్షన్‌ కొనసాగుతోంది.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×