BigTV English

Warner Pushpa style : తగ్గేదేలే.. వార్నర్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్..

Warner Pushpa style : తగ్గేదేలే..  వార్నర్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్..
David Warner Celebrates Pushpa Style

Warner Pushpa style : వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ సెంచరీ చేసిన తర్వాత గాలిలోకి ఎగిరి ‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ తరహాలో పుష్ఫ యాక్షన్ మూమెంట్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారి బెంగళూరు స్టేడియం అంతా హోరెత్తిపోయింది.


ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ కు మనదేశంతో మంచి అనుబంధమే ఉంది.  వార్నర్ ను ఇక్కడ మనవాళ్లందరూ  డేవిడ్ భాయ్ అని  పిలుచుకుంటారు. 36 ఏళ్ల డేవిడ్ అందరితో చాలా సరదాగా ఉంటాడు. కుర్రాళ్లతో కలిసిపోతాడు. మంచి జోక్స్ వేస్తాడు. స్టెప్ప్స్ వేస్తాడు. బాగా నవ్వుతూ.. నవ్విస్తూ ఉంటాడు. డేవిడ్ పక్కన ఉంటే వాతావారణమంతా ఆహ్లాదకరంగా ఉంటుందని అంటూ ఉంటారు.

ఐపీఎల్ సీజన్ లో ఇండియాలో ఉన్నప్పుడు మనవాళ్లతో కలిసి తను కూడా సినిమాలు బాగానే చూసినట్టున్నాడు. పుష్ప అన్ని భాషల్లో బ్లాక్ బ్లస్టర్ అయ్యేసరికి ఆ సినిమా కూడా మనోడు ఎక్కడో చూసి ఉంటాడు .అంతే అప్పటి నుంచి ఎక్కడ చూసినా అవే స్టెప్పులు, అవే లుక్కులు ఇస్తున్నాడు.


స్టేడియంలోకి వెళ్లాక గ్రౌండులో ఫీల్డింగ్ చేస్తూ కూడా అభిమానులను ఉత్సాహ పరుస్తూ పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఒక చేయిని పక్కన పెట్టి, ఒక చేతిని భుజాల మీదకి చేర్చి,  ఒక కాలు జరుపుతూ పుష్ప పాట స్టైయిల్ లో ఇరగదీసి వదిలేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ స్టయిల్ కి తన మేనరిజమ్ ను కలిపి సోషల్ మీడియాలో డేవిడ్ భయ్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. పాక్ తో మ్యాచ్ లో సెంచరీ తర్వాత ‘తగ్గేదేలే’ అంటూ చేసుకున్న సంబరాలకు.. చిన్న స్వామి స్టేడియంలోని ప్రేక్షకులు తోడుకావడంతో వాతావరణం రచ్చరచ్చ అయిపోయింది.

అయితే పుష్ప రిలీజ్ సమయంలో మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఇవే మూమెంట్స్ ఇచ్చేవారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా లాంటి వాళ్లు గ్రౌండ్ లో చేసిన పుష్ప హంగామా మామూలుగా ఉండేది కాదు. అయితే మనవాళ్లు తర్వాత వదిలేశారు. కానీ డేవిడ్ భాయ్ వదల్లేదు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ లో కూడా చిన్న కళాకారుడు ఉన్నట్టు ఉన్నాడు.  అప్పుడప్పుడు వాడు బయటకు వస్తుంటాడని నెట్టింట జోక్స్ పేలుతున్నాయి. అందుకే పాక్ తో మ్యాచ్ లో 85 బంతుల్లోనే సెంచరీ చేసి గాలిలోకి ఎగిరి తగ్గేదేలే. అన్నాడని అంటున్నారు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెంచరీ చేసి డేవిడ్ వార్నర్ రఫ్పాడించాడు. ఒక దశలో డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కుదరలేదు.  పాక్ జట్టులోకి కొత్తగా వచ్చిన ఉసామా మిర్ ఇచ్చిన లైఫ్ తో బతికిపోయిన వార్నర్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మరో పొరపాటు చేయలేదు. అందుకే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఒక్క క్యాచ్ ఎంత విలువైనదో డేవిడ్ నిరూపించాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆట తీరునే అది మార్చేసిందని అంటున్నారు. మొత్తమ్మీద 124 బాల్స్ ఆడిన వార్నర్ 14 ఫోర్లు, 9 సిక్సర్లు సాయంతో 163 పరుగులు చేశాడు. కెరీర్ లో వన్డే మ్యాచ్ ల్లో 21వ సెంచరీ నమోదు చేసుకున్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×