BigTV English

Devara New Poster: పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. రెడీ అవ్వండ్రా అబ్బాయిలు!

Devara New Poster: పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. రెడీ అవ్వండ్రా అబ్బాయిలు!

Devara New Poster about Fear Song: దేవర.. వచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేటి నుంచే పండగ మొదలుపెట్టేస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం అక్టోబర్ లో దసరా కానుకగా రానుంది.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ బర్త్ డే అయిన మే 20 న దేవర నుంచి అప్డేట్ వస్తుంది అని టాక్ నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే అది టీజర్ నా.. ? సాంగ్ నా.. ? అనేది క్లారిటీ లేదు.

ఇక తాజాగా ఆ క్లారిటీని మేకర్స్ అందించారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మొదటి సింగిల్ మే 19 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్ లో ఎన్టీఆర్ చెయ్యిని మాత్రమే చూపించారు. అది కూడా చేతిలో గొడ్డలి.. రక్తంతో తడిచి కనిపిస్తుంది. చూడడానికే చాలా వైలెంట్ గా కనిపిస్తుంది. ఇక ఫియర్ సాంగ్ అంటూ మేకర్స్ చెప్పగానే ఇక ఫ్యాన్స్ ట్రెండ్ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.


Also Read: Pushpa 2: పుష్ప 2 నుంచి అతను అవుట్.. గుంటూరు కారంలా అవ్వదుగా.. ?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించడంతో మ్యూజిక్ పై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Big Stories

×