BigTV English

Technician out from Pushpa 2: పుష్ప 2 నుంచి అతను అవుట్.. గుంటూరు కారంలా అవ్వదుగా?

Technician out from Pushpa 2: పుష్ప 2 నుంచి అతను అవుట్.. గుంటూరు కారంలా అవ్వదుగా?

Technician Out from Pushpa 2 Movie: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్లు.. ఇప్పటివరకు పుష్ప 2 మీద ఒక్క నెగెటివిటీ వచ్చింది లేదు. చాలా సాఫీగా పాజిటివ్ వైబ్స్ తో సాగిపోతుంది. మంచి హైప్ కూడా ఉంది.. ఆగస్టు 15 న అల్లు అర్జున్ మరో రికార్డును క్రియేట్ చేస్తాడు అనుకున్నారు. కానీ, అంతలోనే పుష్ప 2 నుంచి ఒక కీలక వ్యక్తి అవుట్ అంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాని వలన పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు.


అసలేం జరిగింది..? అని అంటే.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప 2. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన పుష్ప ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప తరువాత బన్నీ ఏ సినిమాలో నటించకుండా.. పుష్ప 2 కోసమే కష్టపడుతూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కు మేకర్స్ పక్కాగా ప్లాన్ చేశారు.

ఇక ఇప్పటికే షూటింగ్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా ఎడిటర్ లివింగ్‌స్టన్ ఆంటోనీ రూబెన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డేట్స్ విషయంలో వచ్చిన విబేధాల వలన రూబెన్ తప్పుకున్నాడట.


Also Read: Nagababu: నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్.. ఇప్పట్లో ఆగేలా లేదే.. ?

ఇక అయన ప్లేస్ లో నవీన్ నూలిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పుష్ప 2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. గుంటూరు కారం సినిమాలా ఇది కూడా అవ్వదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×