E-Paper
Advertisement

EV Scooters : ఈవీల చౌక బేరం .. కొన్నాళ్లే!

EV Scooters : ఈవీల చౌక బేరం .. కొన్నాళ్లే!
Advertisement

EV Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్‌ (ఈవీ) కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడాల్సిన తరుణమిది. మోడల్‌ మారనున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థలు రాయితీలు ప్రకటిస్తూ, విక్రయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పెట్రోలు స్కూటర్ల ధరకే ఈవీ వచ్చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈవీలు కొనాలనుకుంటే త్వరపడండి.

వేలల్లో రాయితీలు..
విద్యుత్‌ వాహనాలను తయారు చేసే స్టార్టప్ నుంచి ప్రముఖ సంస్థల వరకు రాయితీలను ప్రకటించాయి. ఏథర్‌ తన 450ఎస్‌, 450ఎక్స్‌ మోడల్‌ స్కూటర్లపై రూ.24వేల వరకు రాయితీతో పాటు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ప్రయోజనాలను కల్పించింది.

Advertisement

క్రెడిట్‌ కార్డులతో కొంటే..
ఓలా విద్యుత్‌ స్కూటర్ల సంస్థ తన ఎస్‌1ఎక్స్‌పై రూ.20వేల వరకు రాయితీ ప్రకటించింది. అంతేకాకుండా వివిధ క్రెడిట్‌ కార్డుల చెల్లింపులపై రూ.5,000 అదనపు తగ్గింపును ఇస్తోంది. వీటికి 6.99 శాతమే వడ్డీ రేటు వర్తిస్తుందని ప్రకటించింది.

5.99% వడ్డీతో
హీరో మోటోకార్ప్‌ తన విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈఎంఐ, బ్యాటరీ వారంటీ, రాయితీ, బదిలీ బోనస్‌, లాయల్టీ, కార్పొరేట్‌ వంటి అన్ని ప్రయోజనాలతో కలిపి రూ.38,500 భారీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది వాహన కొనుగోలుకు 5.99% వడ్డీకే రుణాన్ని అందిస్తోంది.

Advertisement

ప్రభుత్వ సబ్సీడీ..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే వీటి ధరలు 25% వరకు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి, ఈవీ కొనాలనుకువారు ఈ నెలాఖరులోపు కొంటే.. ప్రభుత్వ సబ్సీడీతో వివిధ తగ్గింపుంతో తక్కువ ధరకే వస్తాయి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×