BigTV English

IND vs ENG : భారత్ టూర్ లో ఇంగ్లాండ్ ఓడిపోవడం ఖాయం:  స్టీవ్ హార్మిసన్

IND vs ENG : భారత్ టూర్ లో ఇంగ్లాండ్ ఓడిపోవడం ఖాయం:  స్టీవ్ హార్మిసన్
IND vs ENG

IND vs ENG : సౌతాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే టీమ్ ఇండియా భారత్ చేరుకుంటుంది.  2024 సంక్రాంతి పండుగ అనంతరం భారత్ లో ఇంగ్లాండ్ జట్టు పర్యటించనుంది.  జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో భాగంగా ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ జరగనుంది.


అయితే టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు మాత్రమే ఇంగ్లాండ్ జట్టు భారత్ లో దిగనుంది. పూర్తి స్తాయిలో సన్నద్దత లేకుండానే డైరక్టుగా టెస్ట్ మ్యాచ్ ఆడటంపై ఇంగ్లాండ్ జట్టు మాజీ ప్లేయర్ స్టీవ్ హార్మిసన్ స్పందించాడు. ఇలా ప్రణాళికా బద్ధంగా లేకుండా ఆడితే 0-5 తో ఇంగ్లాండ్ ఓడిపోవడం ఖాయమని తెలిపాడు.  

ఇకపోతే టెస్ట్ సిరీస్ కూడా ప్రతిష్టాత్మకమైనదే. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓటమిపాలై ఐదో స్థానానికి పడిపోయిన ర్యాంకు పైకి లేవాలంటే ఇక్కడ బాగా ఆడాల్సి ఉంటుంది. అలా జరిగితే టీమ్ ఇండియా రెండో స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి. అప్పుడు మళ్లీ రేసులోకి వస్తుంది. పోయిన మొదటి ర్యాంకుకి దగ్గరగా వెళ్లినట్టు ఉంటుంది. అలాగే పాకిస్తాన్ ని వెనక్కి నెట్టినట్టు ఉంటుంది.


భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడాలంటే ఎంతో ప్రిపేర్ అయి వెళ్లాల్సి ఉంటుందని హార్మిసన్ అన్నాడు. అక్కడ ఆరువారాలు ఉంటున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు వాతావరణానికి తగినట్టుగా తమని తాము మలచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇకపోతే సొంత గడ్డపై టీమిండియా ప్లేయర్లు పులుల్లా రెచ్చిపోయి ఆడతారని, వారిని నిలువరించడం చాలా కష్టమని అన్నాడు. సరైన ప్రణాళిక లేకుండా ఆడితే వైట్ వాష్ కావడం ఖాయమని అన్నాడు.

ఈ అంశంపై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తాము అబుదాబికి వెళ్తున్నామని, అక్కడ శిక్షణా శిబరం ఉంటుందని చెప్పాడు. ఆ శిక్షణ తమకు సరిపోతుందని బదులిచ్చాడు.
విమర్శలు గుప్పించాడు. 5-0తో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పాడు. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటర్ ఇచ్చాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×