BigTV English

Jio Shock:- జియో షాక్.. ఇకపై పైసాకు పైసా లెక్కే. జియో సినిమా ఫ్రీ కాదిక

Jio Shock:- జియో షాక్.. ఇకపై పైసాకు పైసా లెక్కే. జియో సినిమా ఫ్రీ కాదిక

Jio Shock:- జియో రాకముందు.. అవసరమైనప్పుడే ఫోన్ రీచార్జ్ చేసుకునే వాళ్లం. 10, 20, 30 రూపాయలు రీఛార్జ్ చేసుకుని, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వాళ్లం. ఎప్పుడైతే రిలయన్స్ జియో మన జీవితాల్లోకి ప్రవేశించిందో.. ఈ చిన్న చిన్న రీఛార్జులన్నీ మాయం. లైఫ్ టైం కోసం ఓ ప్యాక్.. ఆ తరువాత నెలవారీ ప్యాకేజీ. నెల అంటే 30 రోజులు అని అర్ధం.. కాని, జియో వచ్చాక నెల అంటే 24 రోజులే. ముందు అలవాటు చేసి, ఆ తరువాత బిజినెస్ నడపడం రిలయన్స్‌కు ఉన్న అలవాటు. ఇప్పుడు జియో సినిమా విషయంలోనూ అదే స్ట్రాటజీ.


ముందు నుంచి రిలయన్స్ ఏమని ప్రచారం చేసింది.. ఐపీఎల్‌ను మా జియో సినిమా ఫ్లాట్‌ఫాంపై ఫ్రీగా చూసేయొచ్చు అని. నిజంగానే ఇప్పటి వరకు ఫ్రీగా అందించింది. ఇకపై జియో సినిమాలో ఐపీఎల్ చూడాలన్నా.. ఆ మాటకొస్తే ఏ కంటెంట్ చూడాలన్నా ఇకపై డబ్బులు కట్టాల్సిందే. అఫీషియల్‌గా రిలయన్స్ నుంచి వచ్చిందో లేదో గానీ.. సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం.. డబ్బు కట్టు కంటెంట్ చూడు. ఇదీ మెసేజ్.

ఐపీఎల్ పుణ్యమా అని జియో సినిమా ఆప్‌కు ఫుల్ ట్రాఫిక్ పెరిగింది.  వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొడుతోంది. ఐపీఎల్‌ మొదలైన తొలి వారంలోనే 5.5 బిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది జియో సినిమా. ఏప్రిల్‌ 12న జరిగిన చెన్నై- రాజస్థాన్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 22 మిలియన్ల  మంది చూశారని జియో చెబుతోంది. సో, ఇదే టెంపో కంటిన్యూ చేయడానికి కొత్త కంటెంట్ కూడా యాడ్ చేయాలనుకుంటోంది రిలయన్స్. వ్యూయర్స్‌ను పోగొట్టుకోకుండా ప్లాన్స్ వేస్తోంది. ఇందుకోసం 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను  జియో సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. మెయిన్‌గా నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలనేది రిలయన్స్ ప్లాన్స్. అయితే, ఈ కంటెంట్ చూడాలంటే మాత్రం ఫీజు చెల్లించాలంటోంది జియో. ఏ ఫ్లాట్ ఫామ్ కూడా ఇంత కంటెంట్‌ను ఫ్రీగా ఇవ్వదు. కాని, జియో సినిమా టోటల్ ఫ్రీ అని ముందు చెప్పి.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనుకోవడమే జనానికి నచ్చడం లేదు.


ప్రస్తుతానికి జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీనే అయినా.. ప్లే ఆఫ్ రేసుకి వచ్చే సరికి దీనికి కూడా ఛార్జ్ చేయొచ్చని చెప్పుకుంటున్నారు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Big Stories

×