BigTV English

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

AP CID Raids: ఆంధ్రప్రదేశ్‌లో రేపోమాపో టీడీపీ సర్కార్ కొలువుదీరనుంది. జగన్ సర్కార్‌‌లో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులపై దృష్టి పెట్టనుంది కొత్త ప్రభుత్వం. తాజాగా ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.


గచ్చిబౌలి నానక్‌‌రామ్‌ గూడలోని ఆయన ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలకపత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందు ఉండి నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీకి మద్దతుదారుడిగా పనిచేశారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీలో ఆ పార్టీకి లబ్ది కలిగేలా చేశారని ఆయనపై ఫిర్యాదు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీఐడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జే-బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర అని భావిస్తున్నారు.


Also Read: వైసీపీకి రావెల రాజీనామా, ఇదేబాటలో మరికొందరు..

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం సర్వీసులు, పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు 10 నుంచి 15 మంది అధికారులను రప్పించుకుంది. ఆ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఆయా అధికారులు వ్యవహరించా రు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్పటి సీఎస్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే గవర్నర్ ఆదేశాలు జారీచేయడంతో అధికారులు ఆగిపోయారు. లెక్కలు తేల్చిన తర్వాతే ఇక్కడి నుంచి పంపించాలని రానున్న టీడీపీ సర్కార్ భావిస్తోంది.

Tags

Related News

Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్!

Aruna Srikanth: ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సిఫారసులు పనిచేయలేదట..! మరి అరుణ ప్రియుడికి అండగా నిలిచిందెవరు?

Tirumala accident: తిరుమల ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం.. ఆ దేవదేవుడే కాపాడినట్లే!

AP Smart cities: 12 నగరాలకు కొత్త రూపం.. అక్కడ కోట్లల్లోనే ఖర్చు!

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

YS Sharmila: షర్మిల సంచలన పోస్ట్.. జగన్ లోగుట్టు, కొత్త నిర్వచనం

Big Stories

×