Telangana ministers : తెలంగాణలో కొత్తగా కొలువదీరిన ప్రభుత్వంలో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూశాఖ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ దక్కింది. ఆర్థికశాఖను శ్రీధర్ బాబుకు, పురపాలక శాఖను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చారు.
భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం శాఖ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు- ఆర్థిక శాఖ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- పురపాలక శాఖ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – నీటి పారుదల శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ
సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ
కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ