Kerala Doctor Suicide | పెళ్లికొడుకు కుటుంబం అధిక కట్నం డిమాండ్ పూర్తిచేయలేక యువ డాక్టర్ తన జీవితాన్ని అంతం చేసకుంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్సు చదువుతున్న షహానా(26) అనే యువతి అదే కాలేజీలో ఉద్యోగం చేసే మరో డాక్టర్ రువైజ్‌ను ప్రేమించింది. వారిద్దరికీ వివాహం కూడా నిశ్చయమైంది. రువైజ్ కేరళ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా.

కానీ పెళ్లికి ముందు వరుడి కుటుంబ సభ్యులు 15 ఎకరాల భూమి, 1200 గ్రాముల బంగారం, ఒక BMW కారు కట్నం రూపంలో అడిగారు. ఇంత భారీ కట్నం ఇచ్చే స్థోమత తమకు లేదని పెళ్లికూతురు కుటుంబ సభ్యులు చెప్పడంతో వరుడి ఫ్యామిలీ సంబంధం రద్దు చేసింది. షహానీ తండ్రి దుబాయ్ పనిచేస్తూ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారు.
కానీ డాక్టర్ షహానా తన ప్రియుడిని మర్చిపోలేక, వివాహం ఇక జరగదని తెలిసి మనస్తాపం చెందింది. సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆమె గది నుంచి ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన ఓ లెటర్ దొరికింది.
ఈ ఘటన తరువాత డాక్టర్ షహానా కుటుంబం.. వరుడి కుటుంబంపై కట్నం వేధింపు కేసు నమోదు చేసింది. దీంతో డాక్టర్ రువైజ్‌ని డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం డాక్టర్ రువైజ్‌ని పోలీసులు అరెస్టు చేసి.. ఆయనపై కట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.