BigTV English

Honey Trap : హనీట్రాప్ ఎంత పనిచేసింది!

Honey Trap : హనీట్రాప్ ఎంత పనిచేసింది!
Honey Trap

Honey Trap : హనీట్రాప్.. శత్రుదేశాల గూఢచారులు పకడ్బందీగా పన్నే వల. రక్షణశాఖ వంటి కీలక శాఖల్లో సమాచారాన్ని తెలుసుకునేందుకు అనుసరించే కపట వ్యూహం. ఇందుకోసం అందంగా అమ్మాయిలను రంగంలోకి దింపుతారు. వారి మోహంలో చిక్కుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రహస్య సమాచారం సైతం శత్రుదేశాల చేతుల్లోకి చేరుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ సతేంద్ర సివాల్.


మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఇతను.. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణపై ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. పాక్‌కి ఏజెంట్‌గా మారడానికి హనీ ట్రాప్ కారణమని వెల్లడైంది. ‘పూజా మెహ్రా’ అనే పేరుగల అమ్మాయి హనీట్రాప్‌లో చిక్కుకోవడం వల్లే సివాల్ అలా మారాడని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా నిరుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అనంతరం అతని ద్వారా భారత వాయుసేన, నేవీ ఆయుధ వ్యవస్థ వంటి కీలక సమాచారాన్ని పూజ తెలుసుకోగలిగింది. డాక్యుమెంట్లను మాత్రం అందజేయలేదని, అవి తన ఫోన్‌లోనే ఉన్నాయని సతేంద్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వాటిని పరిశీలించే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు నిమగ్నమయ్యారు. పూజా మెహ్రా సోషల్ మీడియా ఖాతాను ఐఎస్ఐ ఆపరేట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.


హనీట్రాప్ ఘటనలు పెరుగుతుండటంతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. వీటిని అడ్డుకునేందుకు కృత్రిమ మేధ(AI) సాంకేతికతను వినియోగించు కుంటోంది. ఇందులో భాగంగా చాట్ బాట్(Chatbot)ను రూపొందించింది. హనీట్రాప్‌లో అతి సులువుగా చిక్కుకునే సైనికులను దీని ద్వారా గుర్తించగలుగుతారు .

వారికి ఏవైనా అవాంఛిత నంబర్ల నుంచి ఫోన్లు వస్తే బ్లాక్ చేస్తుంది. అనుమానిత సైనికులను నిశితంగా పరిశీలిస్తుంటారు. అలాగే.. ఆన్‌లైన్ ద్వారా గూఢచర్యానికి పాల్పడేవారిని గుర్తించి.. వారికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్ స్పెషలిస్టులను భారత ఆర్మీ రంగంలోకి దింపింది. సోషల్ మీడియా ఖాతాల వినియోగంపై కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×