BigTV English

Viral Video: షాపింగ్ మాల్ లోకి గుర్రాలతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే కటకటాల్లో ఊచలు లెక్కిస్తూ..

Viral Video: షాపింగ్ మాల్ లోకి గుర్రాలతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే కటకటాల్లో ఊచలు లెక్కిస్తూ..

సోషల్ మీడియా పుణ్యమా అని  ప్రతి ఒక్కరు పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా వీడియోలు షేర్ చేసి పోస్టు చేస్తున్నారు. కొన్నిసార్లు లైకుల కోసం చేసే పిచ్చి పనులు ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. తాజాగా అమెరికాలో నలుగు యువకులు చేసిన పని.. కటకటాల్లో ఊచలు లెక్కించేలా చేశాయి.


ఇంతకీ అలసు ఏం జరిగిందంటే?

అమెరికా లూసియానాలోని వాల్‌ మార్ట్‌ షాపింగ్ మాల్ లోకి నలుగురు యువకులు ఏకంగా గుర్రాలతో లోపలికి వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు వాళ్లు వీడియో తీశారు. ఈ సందర్భంగా తమను మతా కట్ థ్రోట్ కౌబాయ్స్ గా పరిచయం చేసుకున్నారు.  ఈ వీడియోను WBRZ అనే అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలోకి షేర్ అయ్యింది. కాసేపట్లోనే  తెగ వైరల్ అయ్యింది. వాళ్లు గుర్రాలతో లోపలికి రావడంతో మార్ట్ సిబ్బందితో పాటు యజమాని షాక్ అయ్యాడు. అయినప్పటికీ వాళ్లు ఇంకా లోపలికి అలాగే వచ్చారు. గుర్రాలతో వస్తే కస్టమర్లు భయపడే అవకాశం ఉందని చెప్పినప్పటికీ వాళ్లు అలాగే మాల్ అంతా కలియ తిరిగారు.


పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపింగ్ మాల్ సిబ్బంది   

గుర్రాలతో నలుగురు యువకులు లోపలికి రావడం, కస్టమర్లను భయపెట్టడం పట్ల షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను గుర్తించారు. మాసన్ వెబ్ తో పాటు మరో టీనేజ్ రైడర్ పై పోలీసులు అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరు లొంగిపోయారు.  బ్రెండన్ బ్రిడ్జ్‌వాటర్, పాట్రిక్ డెరోజాన్ అనే మరో ఇద్దరు కూడా ఆ తర్వాత పోలీసులు ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు వెల్లడించారు.

పోలీసులు విచారణలో ఏం తేలిందంటే?

లొంగిపోయిన తర్వాత నలుగురు నిందితులను పోలీసులు విచారించారు. గుర్రాలతో షాపింగ్ మాల్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే విషయంపై ప్రశ్నించారు. దీనికి వాళ్లంలతా ఒకే సమాధానం చెప్పారు. జస్ట్ సరదా కోసమే అలా చేశాం తప్ప.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. “మేం ఎలాంటి చెడు ఉద్దేశంతో షాపింగ్ మాల్ లోకి వెళ్లలేదు. జస్ట్ సరదా కోసమే అలా చేశాం. లోపలికి వెళ్లి కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఫన్ కోసం చేసిన పని ఇలా పోలీసు విచారణ వరకు వస్తుందని ఊహించలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

నలుగురు యువకులు చేసిన పని సరదా కోసమే అయినప్పటికీ, వారి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా షాపింగ్ మాల్ లోకి గుర్రాలతో అడుగు పెట్టడం, అక్కడ ఉన్న కస్టమర్లకు ఇబ్బంది కలిగించడం, మరికొంత మందిని భయాందోళనకు గురి చేయడం లాంటి అభియోగాలు మోపడ్డాయి. సో, ఇకపై రీల్స్ కోసం పిచ్చి పనులు చేసే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×