Jr NTR :జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి అభిమానులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగా అయితే ఎదురు చూస్తారో.. ఆయనను పబ్లిక్ లో చూడడానికి కూడా అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఇచ్చే స్పీచ్ కైతే పడి చచ్చిపోతారనడంలో సందేహం లేదు.. అంతలా ఎన్టీఆర్ ను ఆడియన్స్ ఓన్ చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఎన్టీఆర్ ఇటీవల కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈవెంట్లో కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇకపై ఎన్టీఆర్ కనిపించరా..?
అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. “నేను మళ్లీ ప్రేక్షక అభిమానుల ముందుకు వచ్చేది ఎప్పుడో.. ఇప్పుడు మాట్లాడనివ్వండి” అంటూ వ్యాఖ్యానించిన విషయం మనకు తెలిసిందే. అయితే తారక్ ఇంతవరకు ఎన్నో సినిమా వేదికలను పంచుకున్నారు. తన సినిమాలతో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్లకు అలాగే యంగ్ హీరోల ఈవెంట్లకి కూడా ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఇలా మొదటిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. ఎన్టీఆర్ ఎందుకు ఏ కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఈవెంట్ త్వరలో ఉంది కదా.. ?మరి ఈ ఈవెంట్ కి ఆయన వస్తారా..? వచ్చి అభిమానులను కలుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది వార్2 ఈవెంట్ కి కచ్చితంగా ఎన్టీఆర్ వస్తారు. ఆరోజు అభిమానుల్ని కలుస్తారు.. అంతకుమించి ఆలోచించాల్సిందేముంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Maas Jathara: తూ మేరా లవర్ ఫుల్ సాంగ్ రిలీజ్.. చనిపోయిన చక్రి మళ్లీ బతికొచ్చినట్టు ఉందిగా..!
ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ కండిషన్.. అందుకే ఇలాంటి మాటలా..
ఇలా అభిమానులు ఒకరికి ఒకరు ప్రశ్నలతో తికమక పడుతున్న వేళ ఒక కొత్త విషయం ఫిలిం సర్కిల్ లో చర్చకు వచ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ ఇకపై తన సినిమా ఈవెంట్లకి, కళ్యాణ్ రామ్ ఈవెంట్లకు తప్ప ఇతర హీరోల ఈవెంట్లకు హాజరు కాకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నారని, దీనికి కూడా ఒక బలమైన కారణం ఉందని, అందుకే అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఈవెంట్ లో ఇలా మాట్లాడారని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లుక్ రివీల్ కాకుండా ఉండాలని, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మరో సినిమా ఈవెంట్ కు హాజరు కాకూడదని భావిస్తున్నారట. ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ భాగమవుతున్నారు. ప్రశాంత్ సలహా మేరకు ఇప్పటికే బరువు తగ్గిన ఈయన.. కొంత షూటింగ్ అనంతరం మళ్లీ బరువు పెరగాల్సి ఉంటుంది అంట. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కండీషన్ మేరకు ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.