Morning Habits: ఉదయం లేవగానే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే, రోజంతా మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే మనసులో సానుకూల అంశాలు, ప్రేరణ ఉండటం ముఖ్యం.. మన చుట్టూ ఎంత మంది పాజిటివ్ వ్యక్తులు ఉన్నా మన మనసు నుంచి ప్రేరణ లేకపోతే ముందుకు సాగలేరు. మీ మనస్సులో ప్రేరణ ఉంటే, మీరు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడి విజయం సాధిస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల కొద్ది రోజుల్లో మీ మనస్సులో సానుకూల ఆలోచనలు మెుదలువుతాయి.
సూర్య నమాస్కారం చేయడం:
ఉదయం నిద్రలేచాక మీ రోజును సూర్యనమాస్కారం చేయడంతో ప్రారంభించండి. కొంత మంది నిద్ర లేచాక మంచం నుంచి కిందకు దిగడానికి ఆలస్యం చేస్తారు. మరికొందరు ఎప్పుడో 10 గంటలకు అలా లేస్తుంటారు. ఈ అలవాటు మిమ్మల్ని సోమరితనంతో నింపేస్తుంది. కావున ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మంచం దిగి బయటకు వచ్చి సూర్యనమస్కారం చేయడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల మీ మనస్సులో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. మనసు తేలికగా అనిపిస్తుందని చెప్తున్నారు.
వ్యాయామం లేదా యోగా చేయడం:
ఉదయం లేవగానే వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల మీ శరీరానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది, మరియు ఇది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రారంభంలో కేవలం 5 నిమిషాల వ్యాయామం, మీ మనస్సు, శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. క్రమంగా ఈ వ్యాయామం రోజూ చేస్తూ 30 నిమిషాల పాటు చేయడం అలవాటు చేసుకోండి. ఇలా మీరు రోజూ చేయడం వల్ల దినచర్యగా మారుతుంది.
నీరు తాగడం:
ఉదయం లేచిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరగడమే కాకుండా టాక్సిన్స్‌ను సులభంగా తొలగిస్తుంది. కాబట్టి ఉదయం టీ, కాఫీకి బదులుగా నీటితో ప్రారంభించండి. అంతేకాకుండా ఉదయం లేవగానే నీరు తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది, జీర్ణక్రియ మెరగుపడుతుంది.
ఆరోగ్యకరమైన అల్పాహారం:
ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం లేవగానే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. అల్పాహారంలో మెులకెత్తిన గింజలు, పండ్లు, గింజలు వంటివి తీసుకోవడం చాలా మంచిదంటున్నారు. ఇది మీ శరీరానికి మరియు మెదడుకు శక్తిని ఇస్తుంది. రోజంతా పనిచేయడానికి తగిన శక్తిని అందిస్తుంది.
Also Read: కర్బూజ పండుతో మస్త్ బెనిఫిట్స్.. తింటే మాములుగా ఉండదు..
ఫోన్ చూడకుండా ఉండటం:
ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా కొంత సమయం కేటాయించడం వల్ల మీరు మీ రోజును ప్రశాంతంగా ప్రారంభించగలరు మరియు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీరు నిద్రలేచిన వెంటనే ఎంత సమయం అయిందో తెలుసుకోవడం కోసం గడియారం వైపే చూడండి. ఫోన్ లోనే చూడాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తే మెసేజ్లు, మెయిల్స్, సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తారు. దీంతో అనవసరమైన ఒత్తిడికి గురవుతారు.
ప్రణాళికాబద్ధంగా రోజును ప్రారంభించడం:
మీరు మీ రోజును ఎలా ప్రారంభించాలో మందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇలా మందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు రోజంతా మరింత ఉత్సాహంగా, పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఉదయం లేవగానే మంచి పుస్తకం చదవడం లేదా ప్రేరణ కలిగించే మాటలు వినడం వల్ల మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల మీరు ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉంటారు. మీరు లేచిన వెంటనే మీ మైండ్‌లో వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా వాటిని క్లియర్ చేయడం వల్ల మీరు రోజంతా మరింత ఎక్కువ దృష్టితో పని చేయగలుగుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.