BigTV English

Viral News: 20 ఏళ్లుగా నది దాటి వెళ్తూ, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఈ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉన్నారా?

Viral News: 20 ఏళ్లుగా నది దాటి వెళ్తూ, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఈ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉన్నారా?

Kerala Tube Master: పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో, అంకిత భావంతో రోజూ స్కూల్ కు వెళ్లి పాఠాలు బోధించే టీచర్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఓవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటూనే, మరోవైపు ఇతర వ్యాపారులు చేసుకునే ఉపాధ్యాయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్కూల్ ఎగ్గొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చిట్టీల బిజినెస్ లు చేసే వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లకు పూర్తి విరుద్ధం ఈ లెక్కల మాస్టారు. 20 ఏళ్లుగా నది దాటి వెళ్తూ.. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఏనాడూ స్కూల్ కు సెలవు పెట్టిన రోజు లేదు. తను పాఠాలు చెప్పే స్కూల్లో అందరూ పేద విద్యార్థులే కావడంతో వారికి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎనలేని కృషి చేస్తున్నాడు.   బస్సులో వెళ్లే అవకాశం ఉన్నా, సమయం ఎక్కువ వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నది దాటి వెళ్తున్నాడు. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఎవరు? ఆయన పాఠాలు చెప్పేది ఎక్కడ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం  

కేరళ మల్లప్పురం పరిధిలోని పదింజట్టుమురి లోయర్ ప్రైమరీ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తున్నారు అబ్దుల్ మాలిక్. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయారు. ఎన్నో కష్టాలు పడ్డారు. తన మామ సాయంతో బాగా చదువుకున్నాడు. ఉపాధ్యాడిగా ఉద్యోగం సంపాదించాడు. 1993లో మ్యాథ్స్ టీచర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆయనకు పదింజట్టుమురి స్కూల్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ ఊరికి మూడు వైపుల నుంచి కదలుండి నది ప్రవహిస్తుంది. 12 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ ఊరికి వెళ్లాలంటే బస్సులో 3 గంటల సమయం పడుతుంది.


బస్సులో వెళ్తే టైమ్ వేస్ట్ అవుతుందని..

ప్రతి రోజు స్కూల్ 10.30కి ప్రారంభం అవుతుంది. కానీ, అతడు ఉదయం 8 గంటలకు బస్టాఫ్ కు చేరుకోవాల్సి వచ్చేది. ఆయన స్కూల్ కు వెళ్లే బస్సు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా కూడా   ఇబ్బంది పడుతూ బస్సులో రావాల్సి వచ్చేది. కానీ, కదలుండి నది దాటితే కేవలం ఒక కిలో మీటరు దూరంలోనే స్కూల్ ఉంటుంది. అంత సమయం వేస్ట్ చేసి బస్సులో వెళ్లడం కంటే, నది ఈదుతూ వెళ్లడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. మూడు గంటలు బస్సులో ప్రయాణంతో పోల్చితే, 15 నిమిషాల్లో నది దాటడం బెస్ట్ అనుకున్నాడు. మరో ఉపాధ్యాయుడితో కలిసి రోజూ నది దాటుతూ వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు.

ప్లాస్టిక్ కవర్ లో బట్టలు, బాక్స్.. భుజానికి ట్యూబ్..

నది దాటే సమయంలో  ప్లాస్టిక్ బ్యాగులో లంచ్ బాక్స్, తన బట్టలు పెట్టుకునేవాడు. వాటితో పాటు ఓ ట్యూబ్ తెచ్చుకునే వాడు. దాన్ని నడుముకు తగిలించుకుని నది దాటేవాడు. నది దాటాక ఆ ట్యూబ్ ను, తడిసిన బట్టలను పక్కనే ఉన్న ఓ ఇంటి దగ్గర ఆరబెట్టి వెళ్లేవాడు. ఆయన ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఏనాడు స్కూల్ కు సెలవు పెట్టలేదు. ప్రతి రోజూ సమయానికి స్కూల్ కు వెళ్లి పాఠాలు చెప్పేవాడు. గత 20 ఏళ్లుగా ఆయన ఈ నది దాటుతూ వెళ్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఆయన ‘ట్యూబ్ మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉండటం నిజంగా గొప్ప విషయం.

Read Also:  కొనలేరు.. తినలేరు.. పాకీలకు చుక్కలు చూపిస్తున్న నిత్యవసర ధరలు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×