Pakistan Essential Commodities Prices: ఓవైపు భారత్ తో గొడవ, మరోవైపు బెలుచిస్థాన్ తో పంచాయితీతో అల్లాడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. సైన్యం చేతిలో కీలు బొమ్మగా మారి పాక్ సర్కారు.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. ప్రజల అవస్థలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా అక్కడి ప్రజలు దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనాలో? ఏం తినాలో? తెలియక అల్లాడుతున్నారు.
ఆలూ సమోసా ధర రూ. 60, అల్లం ధర రూ. 600
భారత్ లో 10 రూపాయలు దొరికే ఆలు సమోసా.. పాకిస్తాన్ లో ఏకంగా రూ. 60 పలుకుతోంది. కనీసం ఇంత కాలం సమోసా తిని చాయ్ తాగే ప్రజలు.. ఇప్పుడు సమోసాను ముట్టుకోవాలంటేనే భయపడుతున్నారు. ఆలూ సమోసా ధర చూసి వద్దు బాబోయ్ అంటున్నారు. ఇక కూరగాయల ధరల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కిలో టమాట ధర ఏకంగా రూ. 150 పలుకుతోంది. కొత్తిమీర కట్ట ధర రూ. 100 చెప్తున్నారు. అల్లం కిలో ధర రూ. 600 పలుకుతుండగా, ఎల్లిగడ్డల ధరలు రూ. 400కు కిలో అమ్ముతున్నారు. ఇక నిమ్మకాయలు కిలోకు రూ. 550 చెప్తున్నారు. వ్యాపారులు చెప్పే ధరలు విని జనాలు పాకవుతున్నారు.
నిత్యవసరాల ధరలు అదుపు చేయని పాక్ సర్కారు
నిత్యవసర ధరలు ఇంతలా పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నా, పాక్ సర్కారు ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. కూరగాయాల, ఇతర నిత్యవసర సరుకుల ధరల తగ్గింపునకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇతర దేశాలతో గొడవలు, ఉగ్రవాదానికి ఎక్కువ డబ్బులు తగలేయడంతో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఉగ్రవాదానికి పెట్టే ఖర్చు పేదల ప్రజల అభ్యున్నతి కోసం కేటాయించాలని పాక్ లోని మేధావులు సూచించినప్పటికీ ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు.
Read Also: ఆడవాళ్లకు ఒక భాష.. మగవాళ్లకు మరో భాష.. ప్రపంచంలోనే వింత గ్రామం!
అప్పు తెచ్చేది ఉగ్ర కార్యకలాపాల కోసమే
తాజాగా భారత్ దాడులు చేసిన నేపథ్యంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF దగ్గర అప్పు కోసం చేయి చాచింది. కానీ, ఆ డబ్బులను తెచ్చి ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తారా? అంటే అదీ లేదు. మళ్లీ ఆ డబ్బులను ఉగ్రవాదాన్ని పోషించేందుకు, ఉగ్రవాదాలను మేపేందుకే ఉపయోగించనుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు రకరకాల జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస ఔషధాలు లేని దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పాక్ ప్రభుత్వం తన జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే ప్రజా వైద్యానికి కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు రోగాలు, రొస్టులతో బతుకీడుస్తున్నారు. కానీ, అక్కడి ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ ను బూచిగా చూపించి అక్కడ ప్రజలను అసలు సమస్యల నుంచి సక్సెస్ ఫుల్ గా ఫోకస్ ను మళ్లించే ప్రయత్నం చేస్తోంది.
Read Also: పాకిస్తానీలకు ఎక్కువగా వచ్చే రోగాలు ఇవే.. కారణం మీరు ఊహించలేరు!