Actress Abhinaya : తెలుగు, తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం అభినయంతో ఆకట్టుకున్న అభినయ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఈమె పెళ్ళికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి కొత్తజంటను ఆశీర్వదించారు. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరి జంట బాగుందని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈమె పెళ్లి అయ్యి ఎన్ని రోజుల తర్వాత ఆమె భర్త గురించి ఓ సంచల నిజం బయటికి వచ్చింది.. ఆ వార్త విన్నా అభిమానులు షాక్ అవుతున్నారు… ఇంతకీ ఆయన గురించి బయటపడ్డ నిజమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గ్రాండ్ గా జరిగిన అభినయ వివాహం..
హీరోయిన్ అభినయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చక్కని అందం, అభినయం ఉన్న గొప్ప నటి. ఈమెకు పుట్టుకతోనే చెవుడు, మూగ.. తన అభినయ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది నటి అభినయ. పేరులోనే నటనను పెట్టుకున్నఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమాల పరంగా సక్సెస్ అయిన ఈమె ఇటీవలే తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి పీటలు ఎక్కింది. ఇద్దరిది చూడముచ్చట జంట.. ఆమె భర్త గురించి చాలా మందికి తెలియని నిజం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమె లాగే అతనికి కూడా లోపాలు ఉన్నాయట.. అవును మీరు విన్నది అక్షరాలు నిజం..
అభినయ భర్త పేరు వేగేశన్ కార్తీక్ (సన్నీ వర్మ) కి కూడా మాటలు రావు. అభినయ పుట్టుకతోనే వినికిడి మరియు మాట లోపాలతో బాధపడుతుందన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త వేగేశన్ కార్తీక్ కూడా పుట్టుకతోనే వినికిడి, మాట లోపాలతోనే బాధపడుతున్నాడు.. అభినయ, ఆమె భర్త ఇద్దరూ ఈ వైకల్యం ఉన్నప్పటికీ, వారిద్దరూ తమ కెరీర్లలో స్థిరపడ్డారు. నటిగా గుర్తింపు పొందారు..
Also Read : పెళ్లి పేరుతో యువతిని పలుమార్లు వాడుకున్న స్టార్ నటుడు… అరెస్ట్ చేసిన పోలీసులు..
వేగేశన్ కార్తీక్ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే..
అభినయ ఎలాగైతే సినిమాల్లో నటిగా రానిస్తుందో అలాగే ఆమె భర్త కూడా వరుసగా బిజినెస్ లతో దూసుకుపోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కార్తీక్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచి ప్రేమాయణం నడుస్తుందట.. ఇన్నాళ్లకు పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.. మొత్తానికి 15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత అభినయ సినిమాలో చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.. గత రెండేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా హీరోయిన్లు, హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. మరి కొంతమంది ప్రేమలో పడ్డారు. ఇక ఈసారి ఏ జంట తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారో చూడాలి..