War 2 Official Teaser:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు ఈరోజు కావడంతో ఆయన నటిస్తున్న మూవీల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న వార్ – 2 సినిమా నుంచి తాజాగా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా ఒక అఫీషియల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ విపరీతంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తానికైతే ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
వార్ -2 అఫీషియల్ టీజర్ లో ఏముందంటే..
తాజాగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. ఇద్దరూ భారీ తారాగణం.. ఒకే చోట తలబడితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు అయాన్ ముఖర్జీ. ఇక టీజర్ విషయానికి వస్తే.. “నా కళ్ళు ఎప్పటినుంచో నిన్నే వెంటాడుతున్నాయి కబీర్” అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. “ఇండియా బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్ నువ్వే.. కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటావ్”.. అనే డైలాగ్ తో చీకట్లో మంటల మధ్య హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ నడుమ వార్ ను చూపిస్తూ సడన్గా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేశారు. “యుద్ధానికి సిద్ధం కా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగు థియేటర్లలో విజిల్ వేయించడం గ్యారెంటీ. ముఖ్యంగా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే వార్ సన్నివేశాలకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెప్పవచ్చు.
నిరాశపరిచిన ప్రశాంత్ నీల్..
ఇకపోతే మరొకవైపు ఎన్టీఆర్ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కేజీఎఫ్ 1&2 చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఈ సందర్భంగా ఏదైనా అప్డేట్ వదులుతారని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా ప్రశాంత్ నీల్.. ఈరోజు కాదు త్వరలోనే అప్డేట్ ఇస్తాను అంటూ చెప్పి ఇటు ఆడియన్స్ కి నిరాశ కలిగించారు.
also read:Yellamma Movie Update : అంతా కంప్లీట్… ఎల్లమ్మ మూవీపై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ వేణు..!
Double the fire. Double the fury. Pick your side. 🔥 #War2Teaser out NOW #War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. #YRFSpyUniverse
Hindi: https://t.co/HjQ0NdekHg
Telugu https://t.co/Z1reunIXyC
Tamil https://t.co/y1qj8jj7j6… pic.twitter.com/CcDwzkVYmT— BIG TV Cinema (@BigtvCinema) May 20, 2025