BigTV English

Baby Gets Periods: డాక్టర్లకు సవాల్, పుట్టిన ఐదురోజుల బేబికి పీరియడ్స్

Baby Gets Periods: డాక్టర్లకు సవాల్, పుట్టిన ఐదురోజుల బేబికి పీరియడ్స్

china baby comes periods


5 days old Baby gets started periods: సాధారణంగా అమ్మాయిలకు పీరియడ్స్ అనేవి సహజంగా వస్తుంటాయి, అది వారి జీవన విధానంలో ఓ ప్రక్రియ కూడా. సాధారణంగా పుట్టిన ప్రతి ఆడపిల్లకు 12 నుంచి 16 ఏళ్ల మధ్య పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పుట్టిన ఐదు రోజుల పాపకే పిరియడ్స్ వచ్చాయి. ఈ వార్త చూసిన మీరే ఇంత షాక్ అయితే డైరెక్ట్‌గా చూసిన డాక్టర్లు ఇంకెంత షాక్ అయి ఉంటారు.

మారుతున్న కాలానుగుణంగా.. వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా మానవ జీవనశైలీలో భారీ మార్పులు సంభవించాయనే చెప్పాలి. ఎందుకంటే మనం పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు అంతా కాలుష్యంతో నిండిపోయాయి.అయితే ఈ మార్పులు జీవనక్రియలు, తినే ఆహారపు అలవాట్లలో భాగంగానే జీవనక్రియ నడవాల్సిన సమయంలో నడవటం లేదని వైద్యులు చెబుతున్నారు.


Read More:అంబానీ దంపతుల డ్యాన్స్ అదుర్స్‌, వైరల్ అవుతున్న వీడియో

అంతేకాకుండా జీవన సమతుల్యత కారణంగా.. ఆడపిల్లలు తొమ్మిదేళ్లు కూడా నిండకముందే ఆడపిల్లలకు పీరియడ్స్‌ వస్తున్నాయి. దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు డాక్లర్లు ఆందోళన చెందారు. కానీ.. రాను రాను అది కూడా సర్వసాధారణంగా భావిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు.

కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన మూలంగా ప్రపంచం అంతా షాకయ్యింది. ఈ ఘటనా మన దగ్గర కాదులేండీ.. చైనా దేశంలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక దవాఖానకు తరలించగా.. పండంటి పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన ఐదురోజులకే ఆ పాపకు పీరియడ్స్ రావడం మొదలైంది. అయితే ఆ పాప శరీరం నుంచి రక్తం చూసి భయపడిన తల్లి వైద్యులకు సమాచారం అందించగా వారు కూడా ఖంగుతిన్నారు.

Read More:కొండచిలువ మెడలో వేసుకున్న తాగుబోతు.. చివరకు బిగ్ ట్విస్ట్..!

ఇక ఇదే అంశంపై వైద్యులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు వైద్యులు. అయితే మహిళ గర్భం దాల్చిన చివరి రోజుల్లో పిండం శరీరంలోకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రవేశించినట్లు తెలిపారు. ఈ హార్మోన్ రక్తం రూపంలో పిల్లల ప్రైవేట్ భాగాల నుంచి బయటకు వస్తుంది. ఇది తరచుగా ఆడ పిండంలో జరుగుతుందని సంచలన విషయాలను తెలిపారు. ప్రజలు రుతుస్రావంగా భావిస్తారు. కానీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×