BigTV English

Ambani couple dance viral: అంబానీ దంపతుల డ్యాన్స్ అదుర్స్‌, వైరల్ అవుతున్న వీడియో

Ambani couple dance viral: అంబానీ దంపతుల డ్యాన్స్ అదుర్స్‌, వైరల్ అవుతున్న వీడియో

Video of Ambani couple dancing, going viral


Video of Ambani couple dancing, going viral: ప్రపంచ కుబేరుడు ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్‌ సామ్రాజ్యానికి అధినేత ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ గుజరాత్‌లో అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా ఓ హైలెట్‌గా నిలుస్తోంది. అంతేకాదు.. మేమేమన్నా తక్కువనా.. అంటూ ముఖేష్ అంబానీ ఆయన సతీమణీ నీతా అంబానీ రంగంలోకి దిగారు. స్టేజి మీద స్టెప్పులు వేసేందుకు రెడీ అయిపోయారు. ఆలుమగలు కలిసి రిహార్సల్‌ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఆ వీడియోలకు సంబంధించిన విశేషాలేంటో ఏంటో మీరు కూడా ఓ లుక్ వేయండి.


అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం రోజున షురూ అయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశం నలుమూలల నుండి అతిరథ మహారథులు విచ్చేశారు. ఇప్పటికే ఈ వేడుకల్లో ఐదు ఈవెంట్లు ప్లాన్ చేశారు. కాగా అంబానీ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో వైరల్ కాగా.. ఈ వైరల్‌ వీడియోలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రాజ్‌కపూర్ ఐకానిక్ 1955 సాంగ్‌ ప్యార్‌ హువా ఇక్‌రార్‌ హువా హై అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఇంకేముంది ఇది చూసిన అతిథులు షాక్ అవుతున్నారు. అంబానీయా మజాకా అంటూ కితాబ్ ఇస్తున్నారు. తమ ఇంట్లో జరిగే ఆఖరి పెళ్లి కావడంతో ధూంధాంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. అంతేకాకుండా తమ ఇంటికి వచ్చే అతిథులకు ఎక్కడా కూడా తక్కువ కాకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వంటల దగ్గర నుండి వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు అంబానీ ఖర్చులోనూ తగ్గేదెలే అంటున్నారు. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు మాట్లాడుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారు.

Read More: ఛీ వీడు మనిషేనా.. పానీపూరిలో మూత్రం కలిపాడు!

అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి జులైలో జరగనుంది. ఈ పెళ్లి కోసం వేల కోట్లను ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక.. మార్చి 1 నుండి 3 వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ హీరోహీరోయిన్స్ పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్లోబల్‌ పాప్ సింగర్‌ రిహన్నా ఫిబ్రవరి 29న జామ్‌నగర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కి హైలెట్‌గా నిలిచారు. తన పాటలతో అతిథులను అలరిస్తున్నారు.

Tags

Related News

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Big Stories

×