BigTV English

Intelligent Daughter in Law: తెలివైనా కోడలు.. ఒకేసారి ఏకంగా నాలుగు చేసింది.. వీడియో వైరల్!

Intelligent Daughter in Law: తెలివైనా కోడలు.. ఒకేసారి ఏకంగా నాలుగు చేసింది.. వీడియో వైరల్!
Intelligent daughter in law
Intelligent daughter in law

Intelligent Daughter in Law: పెళ్లై అత్తారింటికి వెళ్లాక ఆడవారికి తిప్పలు తప్పవనే చెప్పాలి. అటు భర్తను, ఇటు అత్తను మెప్పించేందుకు నానాతంటాలు పడాల్సి వస్తుంది. ఇంట్లో పనులు చూసుకుంటూ.. పిల్లలు, భర్త, అత్తామామలకు సేవలు చేస్తుంటుంది. దీంతో కోడళ్లకు తీరిక కూడా దొరకదు. అయితే ఒకప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు జెనరేషన్ మారిపోయింది. చాలా మంది కోడళ్లు తెలివిగా ఆలోచిస్తున్నారు. తమ తెలివిని ఉపయోగించి తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. టాలెంట్ చూపించాలన్నా, ఫేమస్ అవ్వాలన్నా బయట పనులే చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో తాము చేసే పనులతోను ఫేమస్ అవ్వగలమని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కోడలు తరచూ ఇంట్లో చేసే పనులను వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.


ఇంట్లో చేసే పనులను కూడా సులభతరంగా, త్వరగా ముగించుకుని విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరికైనా వినూత్న ఐడియాలు వస్తుంటాయి. అలాంటిదే ఓ ఐడియా ఓ కోడలికి తట్టింది. సాయంత్రం వేళ అవుతుంది. చకచక పనులు పూర్తి చేయాలి. పిల్లలు స్కూలు నుంచి వస్తుంటారు. భర్త ఆఫీసు నుంచి వస్తుంటాడు. ఇక్కడ అత్తామామలకు కావాల్సినవి కూడా అందించాలి. ఇలా ఆలోచిస్తూ ఓ ఇంట్లో కోడలు చకచకా చపాతీలు చేయాలని ఆలోచించింది. ఈ క్రమంలో తనకు తట్టిన ఐడియాను లోకానికి చూపించింది.

ఇంట్లో చేసే చపాతీలకు పిండి కలుపుకుని.. చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కొక్కటిగా చపాతీలు చేస్తూ ఉంటాం. ఇలా చేయడం అంటే ఈజీగా ఓ గంటపైనే పడుతుంది. ఓ వైపు చపాతీలు చేస్తూనే మరోవైపు వాటిని కాల్చాలి.. ఇలా చేయడం అంటే సమయం వృధానే అవుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకుండా పొద్దంతా పనులు చేయడానికే సరిపోతుంది. కానీ ఈమె చేసిన విధంగా చపాతీలు చేస్తే అసలు క్షణాల్లోనే చపాతీలు రెడీ చేయొచ్చు.


Also Read: Chain Snatching: రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ.. ఊహించని షాక్ ఇచ్చిన బైకర్!

?utm_source=ig_web_copy_link">Intelligent daughter in law

Intelligent daughter in lawచపాతీలు చేసేందుకు పెద్ద పిండి ముద్దను కలిపింది. అనంతరం ఆ పిండి ముద్దను స్టవ్ పక్కనే ఉన్న కాస్త పెద్దటి, నునుపు బండపై పెట్టి చపాతీలు చేయడం ప్రారంభించింది. మొదట ఈ వీడియో చూస్తే ఏంటి ఇంత పెద్ద చపాతీ చేస్తుందా అనిపిస్తుందా. కానీ పిండి వేసుకుంటూ రొట్టె కర్రతో పెద్ద పొడవైనా చపాతీని తయారుచేసింది. ఆ తర్వాత ఓ పెద్ద రొట్టె సైజ్ లాంటి గిన్నెను తీసుకుంది. దానిని చేసిన పెద్ద రొట్టెపై గట్టిగా నొక్కుతూ.. నాలుగు చిన్న చపాతీలను తీసింది. అనంతరం వాటిని ఓవైపు రొట్టె పెనంపై వేడి చేసి మరోవైపు మంటలో కాల్చుతూ ఒకేసారి నాలుగు చపాతీలు చేసింది. ఇలా క్షణాల్లోనే చపాతీలను చేసేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తెలివైనా కోడలు అని ప్రశంసిస్తున్నారు.

Related News

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

Viral Video: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?

Viral News: మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న యువతి.. ఏం కష్టం వచ్చిందో?

Hyderabad News: హైదరాబాద్‌ సిటీలో కొబ్బరికాయల దొంగ.. ఆటోడ్రైవర్ అర్థరాత్రి, పగలు వ్యాపారం

Watch Video: మీకు సన్ రూఫ్ కారు ఉందా? కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే!

Viral Video: కదులుతున్న రైల్లో కత్తితో పొడిచి, వామ్మో.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Big Stories

×