E-Paper
Advertisement

Chain Snatching: రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ.. ఊహించని షాక్ ఇచ్చిన బైకర్!

Chain Snatching: రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ.. ఊహించని షాక్ ఇచ్చిన బైకర్!
Advertisement

Chain SnatchingWomen Chain Snatching While Doing Reels on Road: నడిరోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళకు ఓ బైకర్ ఊహించని షాక్ ఇచ్చాడు.సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం రోడ్డుపై ఓ మహిళ రీల్స్ చేస్తుండగా.. ఓ బైకర్ ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఇందిరాపురానికి చెందిన ఓ మహిళ అందంగా మస్తాబై.. రీల్స్ చేయడం కోసం రోడ్డు పైకి వచ్చింది. తన ఎదురుగా ఒకరు ఫోన్ లో వీడియో తీస్తుండగా ఆమె రోడ్డుపై నిదానంగా నడుచుకుంటూ సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తుంది. ఈ తతంగాన్ని అంతా ఓ బైకర్ గమనించాడు. దీన్నే మంచి అనువుగా భావించి ఒక్కసారిగా ఆమె వద్దకు బైక్ పై వచ్చి.. ఆమె మెడలోని మంగళసూత్రన్ని తెంపుకుని పోయాడు.

Advertisement

ఆ చైన్ స్నాచర్ ను ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మొత్తం ఆమె ఫోన్ లో రికార్డ్ అయ్యింది. దీంతో ఆమె వెంటనే తేరుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు అందించిన వీడియో మేరకు పోలీసులు నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నామన్నారు.

Also Read: Viral Video: తనపై జోకులు వేసినందుకు.. బాలికను నడిరోడ్డుపై కత్తితో పొడిచిన వ్యక్తి

Advertisement

ఇటీవల కాలంలో ప్రజలపై సోషల్ మీడియో ప్రభావం ఎక్కువగా ఉందని పోలీసులు అన్నారు. రీల్స్ మోజులో పడి కొందరు రకరకాలు విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వీడియోలు చేసే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×