Big Stories

Vizag Drugs Case Update: కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వా బస్సు.. ఉచ్చు బిగుస్తోందా..?

- Advertisement -

Vizag Drugs Case Update: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈరోజు కూడా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రతినిధులను విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. 3 రోజులుగా విశాఖ పోర్టులో సంధ్య ఆక్వా యాజమాన్యాన్ని విచారణ చేస్తున్నారు. ఆదివారం (మార్చి25) కాకినాడ జిల్లా మూలపేటలో సంధ్య ఆక్వా బస్సులో డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ లు, బ్యాంక్ చెక్కులు దొరకడంతో సంధ్య ఆక్వా యాజమాన్యానికి ఉచ్చు బిగుస్తోంది. డాక్యుమెంట్స్ మాయం చేయడానికి ప్రయత్నం చేయడంపై ప్రశ్నిస్తున్నారు. మరికొద్ది సేపటిలో విశాఖ పోర్టుకు సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ యాజమాన్యం వెళ్లనుంది. మరో 2 రోజుల్లో నార్కోటిక్ టెస్ట్ రిపోర్టులు రానున్నాయి.

- Advertisement -

విశాఖ డ్రగ్స్‌ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందన్న నేపథ్యంలో.. మూలపేటలోని ఆ పరిశ్రమలో 2 రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించింది. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని తెలుస్తోంది. విశాఖ పోర్టు నుంచి CFSకు వెళ్లై కంటైనర్లను తనిఖీ చేసేందుకు అనుసరించే విధానంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. కస్టమ్స్ పనితీరులో లోపాలున్నట్లు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్‌ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా బస్సు అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బస్సు ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సులో ఫైల్స్‌, కొన్ని పరికరాలు ఉన్నట్టు తెలిపారు. అయితే ఆ ఫైల్స్‌ దేనికి సంబంధించినవో అనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: “ఓటమిని అంగీకరిస్తున్నా.. జగన్ ను అలా చేయకపోతే పేరు మార్చుకుంటా..”

ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్‌లో సంధ్య ఆక్వా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీబీఐ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో విలువైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌ లు కంపెనీ ప్రతినిధులు బయటకు పంపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఎంప్లాయిస్‌ను తరలించే బస్సులో డాక్యుమెంట్లను పోలీసులు కనుగొన్నారు. 4 రోజులుగా మూలపేటలోని ఓ కాలనీలో సంధ్య ఆక్వా యాజమాన్యం బస్సును ఉంచింది. సీబీఐ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో డాక్యుమెంట్లను ఎక్కడికి తరలించారన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. బస్ బ్రేక్ డౌన్ కారణమని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అసలు తనిఖీల సమయంలో విలువైన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బస్సును సీబీఐ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు. బస్సు నెంబర్ AP39 TP 2457 అని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News