BigTV English

Lorry Dragged Bike till 2KM: కెమెరాకు చిక్కిన భయానక దృశ్యం.. బైక్‌ను 2 కి.మీ. వరకు ఈడ్చుకుంటూ వెళ్లిన లారీ..!

Lorry Dragged Bike till 2KM: కెమెరాకు చిక్కిన భయానక దృశ్యం.. బైక్‌ను 2 కి.మీ. వరకు ఈడ్చుకుంటూ వెళ్లిన లారీ..!

Lorry Driver Dragged Bike till 2KM in Hyderabad: రోడ్డుపై ప్రయాణం చేసేప్పుడు ప్రమాదం ఎటు నుంచి దూసుకొస్తుందో చెప్పలేము. మనం రోడ్డుపై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్బాల్లో ముందు లేదా వెనుకవారి వల్ల చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ఇటువంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో హల్‌చల్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్ని స్కిట్స్, ఫ్రాంక్‌లు ఉంటాయి. అందులో కొన్ని వీడియోలను చూస్తే కడుపు పగిలేలా నవ్వొస్తుంది. మరి కొన్న వీడియోలు చూస్తే షాక్ అవాల్సి ఉంటుంది.


కానీ.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం మీరు చూస్తే భయంతో వణికిపోతారు. ఒంటినిండా చెమటలు కారిపోతాయి. ఇకపై రోడ్డుపై బైక్ డ్రైవింగ్ చేయాలంటే కచ్చితంగా వెనుకడుగు వేస్తారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి వీడియోలను మన తెలుగు సినిమా గ్రాఫిక్స్‌లో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో మాత్రం రియల్. ఇటువంటి స్టంట్‌లు ఏ హీరో కూడా చేయలేడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగింది.

Truck Hit Motorcycle In Hyderabad
Truck Hit Motorcycle In Hyderabad

ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే హైదరాబాద్ నడిబొడ్డున ఓ లారీ బీభత్సం సృష్టించింది. రాత్రి వేళ ఓ లారీ డ్రైవర్‌ బైక్‌ను ఢీకొట్టాడు. అంతేకాకుండా కిలో మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.


Also Read: కుమారుడు ప్రాణాలు అంటే లెక్కలేదా..? అలా ఎలా చేస్తారు..?

కానీ అతడు తన బైక్‌ను దక్కించుకునేందుకు లారీ డ్రైవర్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. లారీ డోర్‌ని పట్టుకొని వేళాడాడు. అయిన కూడా లారీ డ్రైవర్ కనీసం పట్టించుకోకుండా అలానే 2 కిమీ ఊడ్చికుంటూ వెళ్లాడు. ఈ సంఘటన మొత్తాన్ని ఇతర వాహనదారులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను బిగ్ టీవీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. పాతబస్తీలో లారీ డ్రైవర్ దురుసు ప్రవర్తన అంటూ రాసుకొచ్చారు. ఇది ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ రూట్‌లో జరిగింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×