E-Paper
Advertisement

Viral Video: పానీపూరీ మోదీతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం.. వీడియో వైరల్

Viral Video: పానీపూరీ మోదీతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం.. వీడియో వైరల్

Viral Video: పానీపూరీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. పానీపూరీ బండి కనబడితే చాలు చాలా మంది తినేందుకు ఎగబడుతుంటారు. కానీ ఓ చోట మాత్రం పానీపూరీ కోసం కాకుండా పానీ పూరీ తయారు చేసే వ్యక్తితో సెల్ఫీలు దిగడం కోసం జనం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

గుజరాత్ లో ప్రధాని మోదీని పోలిన ఓ వ్యక్తి పానీ పూరీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పానీ పూరీ బండి నడుపుతున్న వ్యక్తి పేరు అనిల్ భాయ్ ఠక్కర్. 71 ఏళ్ల వయస్సులో పానీపూరీ సెంటర్ నడుపుతున్న ఇతడి దగ్గరికి సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ భాయ్ ఠక్కర్ ప్రధాని మోదీని పోలి ఉండటంతో అక్కడికి వచ్చిన వారంతా ఆయనను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. అరుదుగా ఒకే రూపు రేఖలతో ఉన్న వారు దర్శనమిస్తుంటారు. అనిల్ భాయ్ ఠక్కర్ కూడా మోదీ పోలికలతో ఉన్నారు. అంతే కాకుండా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తుంటారు. దీంతో ఆయన కోసం పానీపూరీ సెంటర్ కు ప్రతి రోజు చాలా మంది వస్తుంటారు. అక్కడికి వచ్చిన వారంతా ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read: ఇదేం తిక్కనో అర్థం కావట్లే .. పానీ పూరీలో వైన్ పోసి తింటూ..

ప్రధాని మోదీ పోలికలతో ఉన్న ఠక్కర్ స్థానికులు, పర్యాటకుల నుంచి తనకు ఎంతో గౌరవం లభిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రధాని మోదీ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలిపారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ తన స్టాల్ ను కూడా నీట్ గా ఉంచుకుంటానని వెల్లడించారు.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×