BigTV English

Donkey – Man Video: ఓర్నీ గాడిదతో ఎకసెక్కాలా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..!

Donkey – Man Video: ఓర్నీ గాడిదతో ఎకసెక్కాలా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..!

Man Repeatedly Irritating Donkey Viral: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్ని వీడియోస్ చూస్తే పొట్ట చెక్కలయ్యేంతలా నవ్వుకోకుండా ఉండలేం. అయితే కొన్ని సార్లు ఆకతాయిలు చేసే పనులు కోపం తెప్పించినా.. అప్పుడప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కొందరు తమ పక్కవారిని ఏడిపిస్తూ, హింసిస్తూ, ఆటపట్టిస్తూ శునకానందం పొందుతుంటారు. మరికొందరైతే మనుషులనే కాకుండా మూగ జీవాలను కూడా చిత్రహింసలకు గురిచేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అలా జంతువులను హింసిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ వారు.. రాక్షసానందం పొందుతుంటారు. తాజాగా అలానే ఓ వ్యక్తి జంతువును సరదాగా ఆటపట్టిస్తున్న వీడియో.. అతన్నే నవ్వులు పాలు చేసింది. మరి అది ఎలానో ఈ వీడియో ద్వారా చూసేయండి.

సదురు వ్యక్తి తనమానాన మేత మేస్తున్న గాడిద వెంటపడగా అది కాస్తా ఎదురు తిరిగింది. దీంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి బతుకు జీవుడా అంటూ పరుగులు తీసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఓ వ్యక్తి గాడిద తోక లాగడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ గాడిద తన తోక లాగడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని వెనుక కాలితో తన్నాలని చూస్తుంది. అయితే ఆ దెబ్బ నుంచి ఆ వ్యక్తి తప్పించుకుంటాడు. గాడిద కదా.. తనని ఏం చేస్తుందిలే అనుకున్నాడో ఏమో అక్కడితో ఆగకుండా పదే పదే దాని తోకను లాగడానికి ప్రయత్నించాడు.

Also Read: అయ్యో పాపం ఆంటీ.. అన్నీ చూసుకుంది కానీ సీసీ కెమెరా మర్చిపోయింది.. గుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది!

ఇక అంతే సంగతి.. ఆ గాడిదకు ఎక్కడ మండిందోగానీ.. ఆవేశంతో వెనక్కి తిరిగి అతడికి గట్టిగానే బుద్ది చెప్పింది. ఒక్కసారిగా వెనక్కు తిగిరిన ఆ గాడిద ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతడు చేసిన పనికి తిక్క కుదిరిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరి మీ ఫ్రెండ్స్‌లో కూడా ఇలా చేసే వారు ఉంటే వారికి ఈ వార్త షేర్ చేసి మీరు కాస్త నవ్వుకోండి.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×