BigTV English

CCTV Camera Footage: అయ్యో పాపం ఆంటీ.. అన్నీ చూసుకుంది కానీ సీసీ టీవీ కెమెరా మర్చిపోయింది.. గుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన ఆంటీ!

CCTV Camera Footage: అయ్యో పాపం ఆంటీ.. అన్నీ చూసుకుంది కానీ సీసీ టీవీ కెమెరా మర్చిపోయింది.. గుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన ఆంటీ!

Egg Stolen by Women Recorded in CCTV Camera: ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొరికితే పరువు పోతుంది అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. జనాలు ఎక్కువగా ఉండే చోటు చేసుకుని ఎవరి పనుల్లో వారు ఉన్న సమయాన్ని అదునుగా చూసి చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కేవలం షాపులు, మాల్స్ లలో మాత్రమే కాకుండా జనాల పాకేట్లు, బ్యాగులు ఇలా ఏది పడితే దాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ ఘటనలు ఎక్కువగా ఇతర దేశాల్లో మాత్రమే తరచూ దర్శనమిస్తున్నా.. తాజాగా భారతదేశంలోను జరుగుతున్నాయి. తాజాగా ఓ ఆంటీ(మహిళ) ఏకంగా చికెన్ సెంటర్లోనే దొంగతనానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఓ మహిళ చికెన్ కోసం చికెన్ షాపుకు వెళ్లి చేతి వాటం ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే మహిళ చికెన్ కొనేందుకు చికెన్ షాపుకు వెళ్లింది. ఆ సమయంలో ఇంకొక మహిళ కూడా అక్కడే ఉంది. అయితే చికెన్ చెప్పిన తర్వాత దానిని ఇచ్చే సమయంలో మెళ్లిగా దొంగతనానికి పాల్పడింది. చికెన్ షాపులో ఉన్న కోడి గుడ్డు ట్రేలలో నుండి నెమ్మదిగా నాలుగు గుడ్లను దొంగతనం చేసింది. వాటిని తీసుకుని తన సంచిలో వేసుకుంది. ఇంతలోనే అక్కడే ఉన్న చికెన్ కొడుతూ ఉన్న అబ్బాయి దానిని గమనించాడు.

Also Read: Viral Video: దుబాయ్ వర్షాల్లో విచిత్ర ఘటన.. రూ. 4 కోట్ల కారును పడవగా మార్చేశాడు


వెంటనే మహిళ దొంగతనం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో తన సంచిని చూపించాలని అడిగాడు. మహిళ తన చేతిలోని సంచిని చూపించడంతో ఆ వ్యక్తి అందులో పెట్టిన గుడ్లను తీశాడు. మహిళ గుడ్లను దొంగతనం చేసిందని వెంటనే ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మహిళ తాను దొంగతనం చేయలేదని, అవి తన సంచిలోని గుడ్లే అని సర్థి చెప్పాలని చూసినా ఆ వ్యక్తి వినలేదు. తమ సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అవుతుందని అబద్ధాలు చెబితే నమ్మను అంటూ గొడవకు దిగాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ను కూడా చెక్ చేశాడు. దీంతో అసలు విషయం తెలియగా గొడవ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×