E-Paper
Advertisement

Viral Video: కరివేపాకు 6 నెలల పాటు తాజాగా ఉంచే సూపర్ టిప్.. వీడియో వైరల్

Viral Video: కరివేపాకు 6 నెలల పాటు తాజాగా ఉంచే సూపర్ టిప్.. వీడియో వైరల్
Advertisement

Viral Video: ఆకు కూరలను ఎక్కువ కాలం నిల్వ చేయలేము. త్వరగా అవి పాడైపోతాయి. అంతే కాకుండా ఆకులు ఎండిపోయి గోదుమ రంగులోకి కూడా మారతాయి. అందుకే చాలా మంది ఆకు కూరలతో పాటు కరివేపాకు, కొత్తిమీర, పూదీన వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. అయినప్పటికీ వాటిని కొద్ది రోజులు మాత్రమే పాడవకుండా ఉంచగలుగుతాము. ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పాడైపోతాయి. కానీ సోషల్ మీడియాలో కరివేపాకు ఎక్కువకాలం తాజాగా ఉంచేందుకు ఉపయోగపడే చిట్కాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఓ ఇన్‌స్టా యూజర్ హోం రెమిడీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మొదట కరివేపాకు కాండం నుంచి వేరుచేసి ఆకులను కడిగిన తర్వాత ఖాళీ ఐస్ ట్రే క్యూబ్‌లలో కొన్ని కరివేపాకులను ఉంచారు. ఆ తర్వాత క్యూబ్‌లలో నీటిని నింపారు. అనంతరం నీటిపై తేలుతున్న ఆకులను మునిగేలా చేశారు. తర్వాత ట్రేను ఫ్రిజ్‌లో పెట్టారు. కరిపేపాకుతో నిండిన నీరు ఐస్ క్యూబ్ లాగా మారిన తర్వాత వాటిని జిప్ లాక్ ఉన్న బ్యాగ్‌లో ఉంచారు. అవసరం ఉన్నప్పుడు ఈ క్యూబ్స్‌ను గోరువెచ్చటి నీటిలో వేస్తే తాజా కరివేపాకు రెడీ.

Advertisement

ఈ చిట్కా ఫాలో అవ్వడం వల్ల కరివేపాకు తాజాగా ఉంటుందని ఇన్ స్టా యూజర్ తెలిపారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నగరాలు, విదేశాల్లో ఉండే వారికి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: రన్నింగ్ ట్రైన్‌పై ఊహించని సీన్.. చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

Advertisement

ఈ టిప్ మీ వంటింట్లో తరుచుగా ఉపయోగించే కరివేపాకు తాజాగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఈ ఐడియాను మెచ్చుకుంటున్నారు. ఇతర దేశాల్లో ఉండే వారికి తాజా కరివేపాకు దొరకడం కష్టం. అలాంటి వారికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×