BigTV English
Advertisement

Today Horoscope: రాశి ఫలాలు.. బుధవారం జూన్ఈ 19న రాశి వారు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందుతారు

Today Horoscope: రాశి ఫలాలు.. బుధవారం జూన్ఈ 19న రాశి వారు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందుతారు

Today Horoscope: జ్యోతిష్యప్రకారం 12 రాశులలో మంగళవారం ఎవరికి అనకూలంగా ఉంది. ఎవరికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా నేడు రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


మేషం..
కొత్త పనులు ప్రారంభించడానికి సరైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. భయం, అనుమానం వదిలేయాలి. ఎక్కువకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. దైవారాధన ఉంటే మంచిది.

వృషభం..
ఈ రాశి వారికి అనుకూలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక పరిస్థితులు మెరగవుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ భాగస్వామితో కలిసి ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మేలు చేస్తుంది.


మిథునం..
మిథునం రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఏకాగ్రత కోల్పోకుండా ముగిస్తే విజయం సాధిస్తారు. ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండండి.జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. విష్ణు నామస్మరణ చేయాలి.

Also Read: Jupiter-Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత కుజుడు, గురు గ్రహాల కలయిక.. ఈ 3 రాశుల వారికి ధనలాభం

కర్కాటకం..
ఈ రాశి వారికి కీలక సమయాల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అధిరారులతో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అష్టోత్తర శతనామావళి పారాయణం చదవాలి.

సింహం..
బంధువుల సహకారం ఉంటుంది. వ్యాపారల్లో కొంత నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. లక్ష్యంపై మాత్రమే ఫోకస్ ఉండాలి. శ్రమ ఫలిస్తుంది. ఆందోళన చెందకుండా ముందుకు సాగాలి. జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి.

కన్యరాశి..
కీలకమైన పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. నిర్లక్ష్యం చేయవద్దు. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బంది పడుతారు. కొంత సహాయం పొందుతారు. అనవసర ఖర్చులు చేస్తారు. కోపం అధికమించాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ ఆరాధన ఉండాలి.

Also Read: Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి.

తులరాశి..
మనోబలం అవసరం. సంతోషంగా ఉంటారు. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. కీలక సమయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కులదైవాన్ని పూజించాలి.

వృశ్చికం..
ఈ రాశి వారిక అనుకూలం. కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయించుకోవాలి. మనోబలంతో పనులు పూర్తి చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మిత్రులతో చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి.

ధనుస్సు..
కీలక వ్యవహారాల్లో అనుకూలత ఉంది. సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇష్టమైన వారితో సమయం కేటాయించాలి. ప్రయాణాలు చేస్తారు.వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. దుర్గాస్తోత్రం చదవాలి.

Also Read: Jupiter Transit: బృహస్పతి అనుగ్రహంతో ఏడాదంతా ఈ రాశుల వారికి అన్నీ శుభాలే !

మకరం..
అనారోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయవద్దు. కీలక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. శివస్తోత్రం చదవాలి.

కుంభం..
ఈ రాశి వారు శుభవార్త వింటారు. పిల్లలు విజయం సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం వరిస్తుంది. అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం..
మీన రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆపద వచ్చే అవకాశం ఉంది. విభేదాలు కలగవచ్చు. బంధువులతో ఆచితూచి నడుచుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి. కనకధారాస్తవం చదవాలి.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×