BigTV English

Viral Video: ఈ పక్షిది కడుపా చెరువా.. ? 4 చేపలను క్షణాల్లో అలా తినేసింది ఏంటి

Viral Video: ఈ పక్షిది కడుపా చెరువా.. ? 4 చేపలను క్షణాల్లో అలా తినేసింది ఏంటి

Viral Video: పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పక్షుల ప్రేమికులు చాలా మంది ఉంటారు. వాటిని పెంచుకుంటూ కూడా ఉంటారు. అయితే పక్షులు చూడడానికి అందంగా ఉన్నా కూడా కొన్ని పక్షులు మాత్రం క్రూరంగా కూడా ఉంటాయి. అందులో గ్రద్ధ, గబ్బిలం వంటి పక్షులు ఉదాహరణకు చెప్పుకోవచ్చు. అయితే పక్షుల్లో కొన్ని మాంసాహారం తింటే, మరికొన్ని పక్షులు కేవలం ఆకులు, పుల్లలు, గడ్డి మాత్రమే తిని జీవిస్తుంటాయి. ఒక్కో జాతికి చెందిన పక్షులు ఒక్కోలా ఉంటాయి. ఇలా చాలా రకాల పక్షులు చెట్లుపై నివసిస్తూ, వేరే ఊర్లకు వలస వెళుతూ ఉంటాయి. ఈ క్రమంలో చెట్లపై గూళ్లు కట్టి వాటిలో పిల్లలను కూడా పెడుతుంటాయి. వాటిని సంరక్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి.


పిల్లలు పెట్టిన అనంతరం వాటికి ఆహారాన్ని కూడా చేరవేస్తుంటాయి. పక్షులు వాటి నోటితో ఆహారాన్ని తీసుకుని వెళ్లి ఇస్తుంటాయి. అయితే కొన్ని పక్షులకు కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. కానీ మరికొన్ని పక్షులు మాత్రం విపరీతంగా తింటుంటాయి. సముద్ర పరిసరాల్లో తిరిగే పక్షులు అయితే చేపలను పట్టుకుని తినేస్తుంటాయి. అందులో పెద్ద పెద్దగా పక్షులు అయితే కుందేళ్లను కూడా తినేస్తుంటాయి. అయితే తాజాగా ఓ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ పక్షి ఏకంగా చేపల్ని అమాంతం మింగేసింది. కేవలం 15 సెకన్లలో 4 చేపలను మింగేసింది. దీనిని చూసిన నెటిజన్లు సహా అక్కడి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. ముందుగా ఆ పక్షి వచ్చి అటు ఇటు చూసింది. అనంతరం ఒక ఎరుపు రంగు డబ్బాలోని నీటిలో ఉన్న నాలుగు చేపలను చూసి తినాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో ముందుగా మూడు చేపలను తినేసింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని నాలుగో చేపను కూడా తినేసింది. ఇలా కేవలం 15 సెకన్లలో 4 చేపలను తినడంతో అంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.


Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×