BigTV English

Shocking Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానంటూ బోరున ఏడ్చిన బాలుడి వీడియో వైరల్

Shocking Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానంటూ బోరున ఏడ్చిన బాలుడి వీడియో వైరల్

Shocking Video: ఇటీవల దేశంలో కిడ్నాప్ కు సంబంధించిన ఘటనలు తరచూ విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకుని వెళ్తున్నారు. అభం శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని వయసులోకి వచ్చిన పిల్లల వరకు కిడ్నాప్ చేసి డబ్బుుల సంపాదిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వందల్లో వెలుగుచూస్తున్నాయి. అయితే కిడ్నాపర్ అనగానే సాధారణంగా మూర్ఖంగా ఉంటారని, పిల్లలను తీసుకెళ్లి చిత్రహింసలు చేస్తారని, లేదా అమ్మేసి డబ్బులు సంపాదిస్తారని అందరు భావిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


ఓ అభం శుభం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో వెలుగుచూసింది. చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా 14 నెలల క్రితం ఓ బాలుడిని కిడ్నాప్ చేశాడు. 11 నెలలు ఉండగా పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ తరుణంలో పిల్లవాడి తల్లిదండ్రులు జైపూర్ లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పీఎస్ పరిధిలో ఉండే పృథ్వీ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తల్లి బంధువే అని పోలీసులు నిర్ధారించారు. బంధువైన తనూజ్ చాహర్ అనే హెడ్ కానిస్టేబుల్ బాలుడిని కిడ్నాప్ చేశాడు.

బాలుడి తల్లి తనూజ్ తో రావడానికి ఇష్టపడలేదని అందుకే బాలుడిని కిడ్నాప్ చేశాడు. దీంతో కిడ్నాప్ అనంతరం తనూజ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చాలా కాలం పాటు దాక్కుని ఉన్నాడు. ఈ రతుణంలో గడ్డం, జుట్టు పెంచుకుని వేషాన్ని మార్చుకున్నాడు. ఈ తరుణంలో పోలీసులు తాజాగా తనూజ్ ఎక్కడ ఉంటున్నాడో గుర్తించారు. సన్యాసిగా మారిపోయి యమునా నది సమీపంలో గల ఖాదర్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.


ఓ గుడిసెలో నివసిస్తూ పిల్లాడిని చూసుకుంటూ బ్రతుకుతున్నాడు. అయితే కిడ్నాప్ చేసినా కూడా తనూజ్ బాలుడిని చాలా గారాభంగా చూసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా తనూజ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు బాలుడిని తీసుకుని, తనూజ్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలుడు తనూజ్ కు చాలా దగ్గరయ్యాడు. దీంతో బాలుడు తనూజ్ ను వదిలి అస్సలు రాలేకపోయాడు. పోలీసులు బాలుడిని తీసుకుని వెళ్తున్న క్రమంలో బోరున ఏడ్చేశాడు. కిడ్నాప్ చేసినా కూడా ఎంతో ప్రేమగా చూసుకోవడంతో పృథ్వీ వదలడానికి ఇష్టపడలేదు. అయితే పిల్లాడు తనూజ్ ను వదిలి వెళ్తూ బోరున ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కిడ్నాపర్ పిల్లవాడిని ఇంత బాగా చూసుకోవడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×