BigTV English

Radikaa Sarathkumar: అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు.. నటి రాధిక శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Radikaa Sarathkumar: అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు.. నటి రాధిక శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Radhika Sarathkumar shocking comments: హేమ కమిటీ రిపోర్ట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నటీమణుల వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ చూసి కొందరు ఖంగుతింటున్నారు. మలయాళ ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు నటీమణులను లైంగికంగా వేధించినట్లు ఈ రిపోర్ట్‌లో వెల్లడైంది. మలయాళ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, యాక్టర్లు, నిర్మాతలు హీరోయిన్లను లైంగికంగా వేధించినట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమలోనూ ఉందని ఇంకొందరు నటీమణులు చెప్పుకొస్తున్నారు.


ఒక్క మలయాళీ ఇండస్ట్రీయే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోయిన్లను లైంగికంగా వేధించేవారు ఉన్నారని కొందరు నటీమణులు చెప్పుకొస్తున్నారు. అయితే హేమ కమిటీ రిపోర్ట్ రాకముందు వరకు ఎవరూ కూడా ఈ విషయంపై నోరువిప్పే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ బయటకొచ్చి చెబితే సినిమా అవకాశాలు రావనే భయం కొందరిలో.. ఏమైనా చేస్తారేమో అని ఇంకొందరిలో.. తమ పేరు చెడుగా ప్రజల్లోకి వెళుతుందని మరికొందరిలో భయం ఏర్పడింది.

అయితే ఈ హేమ కమిటీ రిపోర్ట్ బయటకొచ్చిన సందర్భంలో నటీమణులు తమ గోడును విలపించుకుంటున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా, అలాగే పలు ఇంటర్వ్యూలలో చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు తమ సినీ కెరీర్‌లో ఎదురైన అనుభవాలను వెల్లడించారు. తమను ఎవరెవరూ లైంగికంగా వేధించారు వారి పేర్లను సైతం బయటపెడుతున్నారు. తాజాగా మరో సీనియర్ స్టార్ హీరోయిన్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వెల్లడించారు.


Also Read: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి కల్పిక కామెంట్స్.. అమాయకత్వంతో అలా చేశాను, కానీ..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నటీమణులపై వేధింపులు ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా హీరోయిన్ల కారావ్యాన్‌లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని.. అలాంటివి తన కంట పడ్డాయని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. గత 46 ఏళ్ల నుంచి తాను ఇండస్ట్రీలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తాను ఒక సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లి.. అది ముగించుకుని వస్తున్న క్రమంలో సెట్‌లో కొందరు మగవారంతా ఒక దగ్గర కూర్చుని ఏదో వీడియో చూస్తూ నవ్వుకుంటున్నారన్నారు.

అయితే వారు ఏదో వీడియో చూస్తున్నారని అర్థమై.. వెంటనే ఓ వ్యక్తిని పిలిచి వారు ఏం చూస్తున్నారని అడిగానని.. ఆపై అతడు చెప్పే సమాధానంతో తాను షాకైనట్లు తెలిపారు. కారవ్యాన్‌‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల వీడియోలు రికార్డ్ చేసి ఫోన్‌లో చూస్తున్నారని.. ఆర్టిస్ట్ పేరుతో సెర్చ్ చేస్తే వీడియో వస్తుందని అతడు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని పేర్కొన్నారు. అయితే తాను వారి పేర్లు చెప్పాలనుకోవడం లేదని.. ఈ విషయం గురించి మూవీ యూనిట్‌కి అప్పుడు ఫిర్యాదు చేశానని తెలిపారు. వెంటనే టీమ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆపై ఇతర నటీమణులకు కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమన్నానన్నారు. ఆ తర్వాత నుంచి కారవ్యాన్ ఉపయోగించాలంటే చాలా భయం వేసిందని చెప్పుకొచ్చారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×