BigTV English
Advertisement

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Shocking Video: వినాయక చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గల్లీ గల్లీలో వినాయకుడి మండపాలు, పాటలతో కలకలలాడుతున్నాయి. మరో రెండు రోజుల్లో నిమర్జనం కూడా జరగబోతుంది. ఇప్పటికే గణేషుడిని ప్రతిష్టించి 8 రోజులు కావోస్తుంది. అయితే బొజ్జ గణపయ్యను పూజించేందుకు భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ తమ కోరికలను తీర్చాలని మొక్కులు పెడుతున్నారు. అయితే బొజ్జ గణపయ్య వాహనం ఎలుక అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలుక వాహనం ఎక్కి ముల్లోకాలు తిరిగేవాడు ఆ గణేషుడు అని అంటారు. అయితే తాజాగా గణపతి చతుర్థి వేడుకల సందర్భంగా ఓ ఎలుక చేసిన వింత పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


ఓ చిట్టెలుక గజానుని వద్దకు వచ్చి నమస్కారం చేసింది. ఈ విషయం వింటే ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం అండోయ్. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని మీరా భయందర్‌లో ఒక గణేష్ మండపంలో వెలుగుచూసింది. గణేషుడి వాహనం అయిన మూషికం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ చిట్టి ఎలుక కొన్ని సెకన్ల పాటు చేసిన పని అందరినీ దైవస్మరణ చేసుకునేలా చేసింది. ఒక్కసారిగా గణేషుడి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుక ముందుగా అటు ఇటు చూసింది. అనంతరం ఎవరు లేవరని అక్కడి మోదకాలు తీసుకోవాలని అనుకుంది.

ఈ క్రమంలో ముందుంగా గణేషుడి పాదాల వద్ద రెండు కాళ్లపై నిలబడి నమస్కరించింది. రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టింది. ఈ అరుదైన సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే కేవలం నమస్కరించడం మాత్రమే కాకుండా గణేషుడికి నైవేద్యంగా సమర్పించిన మోదకాలను తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పెరిగింది. దీనికి ఏకంగా తొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sai Samarpan (@sai_samarpan_cha_raja)

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sai Samarpan (@sai_samarpan_cha_raja)

Related News

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Viral Video: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Viral News: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?

Pregnancy Job Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?

Big Stories

×