BigTV English

Viral Video: పిల్లల ముందే రెచ్చిపోయిన టీచరమ్మ.. అసభ్యకరమైన పాటకు డ్యాన్స్ చేస్తూ హల్‌చల్

Viral Video: పిల్లల ముందే రెచ్చిపోయిన టీచరమ్మ.. అసభ్యకరమైన పాటకు డ్యాన్స్ చేస్తూ హల్‌చల్

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు కొంత మందిని ఫేమస్ చేస్తే మరికొంత మందిని మాత్రం ఉద్యోగాలు పోయేలా, విమర్శలకు గురయ్యేలా చేస్తుంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులు ఇలా చాలా మందికి సంబంధించిన వీడియో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. పిల్లలను కొట్టడం, తిట్టడం, వారి ముందు మద్యం సేవించడం, లేదా క్లాస్ రూంలోనే నిద్రపోవడం వంటి చాలా సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ టీచర్ చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఓ ఉపాధ్యాయురాలిగా వ్యవహరిస్తూ పిల్లలకు మంచి, చెడులు చెప్పాల్సింది పోయి వారిని చూసి సిగ్గుపడేలా చేసింది ఓ టీచరమ్మ. ఉపాధ్యాయ దినోత్సవంలో ఓ మహిళా టీచర్ పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి అందరినీ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. గురుపూజోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతీ పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ తరుణంలో పిల్లలు టీచర్ల పట్ల తమ ప్రేమ, అభిమానం, గౌరవాన్ని తెలియజేస్తూ వారికి బహుమతులు ఇవ్వడం, స్పీచ్ లు ఇవ్వడం వంటివి చేశారు. అయితే ఈ తరుణంలో ఓ స్కూల్లో టీచరమ్మ పిల్లల ముందే రెచ్చిపోయి ప్రదర్శన చేసింది. ఓవైపు సర్వేపల్లి రాధకృష్ణ ఫోటోను పెట్టుకుని మరోవైపు పిల్లలు, ఇక ఉపాధ్యాయ దినోత్సవం అని కూడా ఆలోచించకుండా అసభ్యకరమైన పాటకు చిందులేసింది.

వీడియోలో టీచర్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. స్కూల్ గదిలో ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని ఉండగా, స్త్రీ2 సినిమాలోని తమన్నా చేసిన ఆజ్ కి రాత్ పాటకు చిందులేసింది. ఈ క్రమంలో నడుమును చూపిస్తూ చీర కట్టు సరిగా లేకుండా అందరి ముందు రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు టీచర్ చేసిన పనికి మండిపడుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం స్కూల్లో జరిగినట్లు చూపిస్తుంది. టీచర్ ఇలా పిల్లల ముందే ఇలాంటి పాటలకు డ్యాన్స్ లు చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఉపధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇలా ఎవరైనా డ్యాన్స్ లు చేస్తారా అని ఏకిపారేస్తున్నారు.


 

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×