BigTV English

Gautham Adani: ఆదానీకి కెన్యాలో ఎదురు దెబ్బ..కార్మికుల నుంచి వ్యతిరేకత

Gautham Adani: ఆదానీకి కెన్యాలో ఎదురు దెబ్బ..కార్మికుల నుంచి వ్యతిరేకత

Kenya airport strike over Adani deal leads to chaos: భారత బడా పారిశ్రామిక వేత్తలలో ఒకరు గౌతమ్ ఆదానీ. ప్రపంచస్థాయి కుబేరులలో ఒకరైన ఆదానీకి కెన్యా ప్రభుత్వం నుంచి షాక్ ఎదురయింది. కెన్యా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ నిమిత్తం గౌతమ్ ఆదానీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ కెన్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతం నైరోబీలో ఉన్న జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతను ముప్పై సంవవ్సరాల పాటు నిర్వహించేందుకు అదానీ కంపెనీ ఒప్పందం చేసుకుంది కెన్యా. అయితే అనూహ్యంగా అదానీకి అక్కడి కంపెనీ వర్కర్ల నుండి వ్యతిరేకత ఎదురయింది. కెన్యా ప్రభుత్వం అక్రమంగా అదానీకి నిర్వహణ బాధ్యతను ఎలాంటి నియమాలు పాటించకుండా కట్టబెట్టిందని అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది అదానీకి వ్యతిరేకంగా కోర్టు కెక్కారు. కెన్యా ప్రభుత్వం తీసుకున్న 30 సంవత్సరాల లీజును తాత్కాలికంగా చెల్లదని కెన్యా హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఉద్యోగుల్లో అభద్రతా భావం

ఆదానీ సంస్థ భారత్ కు సంబంధించిన ఎయిర్ పోర్టల నిర్వహణ చూసుకుంటోంది. దేశంలోని టాప్ టెన్ విమానయాన సంస్షల నిర్వహణలో ఎక్కువ భాగం అదానీయే చూసుకుంటోంది. అదానీ కి ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తే ఎక్కువగా భారతీయులే లబ్దిపొందుతారని..తమ ఉద్యోగాలకు కూడా ముప్పు వస్తుందని వారు భావించడంతో కోర్టుకు వెళ్లారు తమకు న్యాయం చేయాలని..కేవలం అభద్రతా భావంతోనే ఏవియేషన్ ఉద్యోగులు అలా భయపడుతున్నారని..కెన్యా ప్రభుత్వం వారి ఉద్యోగాలకు ఎలాంటి భయమూ అక్కర్లేదని చెబుతున్నా..అక్కడి ఉద్యోగులు మాత్రం ఒప్పుకోవడం లేదు. అదానీ నిర్వహణ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అక్కడి యేవియేషన్ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు ఉధృతం చేశారు. అయినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అంటున్నారు. దీనిపై అదానీ గ్రూప్ సంస్థలకు చెందిన గౌతమ్ ఆదానీ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. తాను తన డీల్ కొనసాగిస్తారా లేక ఆందోళనలకు తలొగ్గి ఒప్పందం రద్దు చేసుకుంటారా అనేది తేలాలి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×