BigTV English

Chandrababu: రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయడమే నా జీవిత ఆశయం: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయడమే నా జీవిత ఆశయం: చంద్రబాబు

Chandrababu: ప్రపంచాన్ని శాసించే శక్తి మహిళల్లో ఉందని.. దానికి చేయాల్సిందల్లా కేవలం వారిని చదివించి, నైపుణ్యాలు పెంచితే సరిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగు జాతిని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తన కోరిక అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరులో మహిళలతో ముఖాముఖి నిర్విహించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలుగు జాతిని నంబర్ వన్ స్థానంలో ఉంచడం కోసం తాను ప్రయత్నాలు చేస్తుంటే.. జగన్ మాత్రం అందర్నీ మోసం చేసి ఒక్కడే ఉండాలను వ్యక్తి అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎక్కడ చూసినా.. కుంభకోణాలే తప్ప మరేం కనిపించడం లేదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను పేదవారికి అందించకుండా.. జగన్ ఒక్కరే దోచుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయడమే తన జీవిత ఆశయం అని చంద్రబాబు వెల్లడించారు. మహిళల్లో చాలా చైతన్యం ఉందని గుర్తు చేశారు. ప్రపంచాన్ని శాసించే శక్తి మహిళల్లో ఉందని.. దానికి చేయాల్సిందల్లా కేవలం వారిని చదివించి, నైపుణ్యాలు పెంచితే సరిపోతుందని.. దీంతో వారు అద్భుతాలు సృష్టిస్తారని చంద్రబాబు అన్నారు.


Also Read: YS Sharmila nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా?

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందించామన్నారు. మహిళలకు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు వెల్లడించారు. గతంలో టీడీపీ దీపం పథకం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్పేసిందని ఆరోపించారు.

Related News

AP rainfall alert: ఏపీలో మళ్లీ వానల దాడి.. తీర ప్రాంతాలకి అలర్ట్!

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

Big Stories

×