4 Crore Car turned into Boat Dubai: దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఒక ఏడాది అంతా కురవాల్సిన వర్షం అంతా కేవలం కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్ నగరం నీటిలో మునిగిపోయింది. రోడ్లు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. అంతేకాదు వరద నీటిలో సబ్ వేలు మునిగిపోవడంతో చాలా మంది ప్రయాణానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో అక్కడి వారు మహిళలను తరలించడానికి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా దుబాయ్ లో మరో వ్యక్తి ఏకంగా కోట్ల రూపాయల కారుపై వరద నీటిలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది.
?utm_source=ig_web_copy_link">
Also Read: చైనాలో విచిత్ర ఆలయం.. వెళ్లాలంటే సాహసమనే చెప్పాలి
రూ. 4 కోట్ల ధర కలిగిన కారుపై ఓ వ్యక్తి వరద నీటిలో ప్రయాణించాడు. భారీ వర్షం కురిసి వరద నీరు చేరడంతో అక్కడ వాహనాలు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో అతడు తన కారునే పడవగా మార్చాడు. రెడ్ కలర్ రోల్స్ రాయిస్ బానెట్ పై కూర్చుని వరదలో ప్రయాణించాడు. అంతేకాదు ఈ తరుణంలో ఎనర్జీ డ్రింక్ పట్టుకుని తాగుతూ ఎంజాయ్ చేస్తూ మరి ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.