Big Stories

Election Commission: ఎన్నికల వేళ ఏపీలో మరో షాక్.. ఇద్దరిపై బదిలీ వేటు..

Election Commission: ఎన్నికల వేళ ఈసీ ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలో వేటు వేసింది. ఇంటలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణను బదీలీ చేయాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది.

- Advertisement -

ఇంటలిజెన్స్ డీజీ సీఎస్ఆర్ ఆంజనేయులుపై ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈసీ డీజీతో పాటు విజయవాడ సీపీని కూడా బదిలీ చేయాలని ఆదేశించారు. వెంటనే ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఆదేశించారు. ఈ రెండు పోస్టులకు సంబంధించి ముగ్గురు అడిషనల్ డీజీ, ముగ్గురు ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ల పేర్లతో కూడిన ప్యానల్ పంపాలని ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

- Advertisement -

సీఎం జగన్‌పై రాయి దాడి జరగడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ప్రాంతంలో పవర్ కట్ జరగడం.. ఆ పై రాయితో దాడి జరగడం ఏంటని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అటు చిలుకలూరిపేటలో ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఇంటలిజెన్స్ చీఫ్‌ సీతారామాంజనేయులుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. దీంతో వారిపై బదిలీ వేటు వేసింది ఈసీ.

కాగా ఎన్నికలు ముగిసేవరకు ఇద్దరు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News