Big Stories

Giddalur Politics: గిద్దలూరు గడబిడ.. కోవర్టుల కిరికిరి..

Giddalur Politics: ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఆ నియోజకవర్గంలో మండే ఎండల కన్న రాజకియ వేడి పెరిగిపోతోంది. లోకల్, నాన్ లోకల్ ప్రత్యర్ధులు హై పిచ్‌లో మాటల యుద్దానికి దిగుతున్నారు. రాజకీయ అవసారాల కోసం వలప వచ్చిన అభ్యర్ధిని వచ్చిన చోటకే పంపించాలని ఒకరు.. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారిన వ్యక్తిని దూరం పెట్టలాని ఇంకొకరు ప్రజల వద్దకు వెళ్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో? అక్కడ పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉందో?

- Advertisement -

ప్రకాశం జిల్లా గిద్దలూరు మూడు జిల్లాల సరిహద్దు ప్రాతం. కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దు.. కడప, కర్నూలు జిల్లాల్లో ఆ నియోజకవర్గం విస్తరించి ఉంటుంది. ఎన్నికలు దగ్గరపడేకొద్ది గిద్దలూరులో రాజకీయాలు అనుహ్యంగా మారుతున్నారు. ఇప్పటి వరకు గిద్దలూరు సెగ్మంట్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువసార్లు కాంగ్రెస్, రాష్ర్ట విభజన తర్వాత వైసీపీలు గెలుపొందాయి. వైసీపీకి అడ్డాగా ఉన్న గిద్దలూరులో ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. టీడీపీ అభ్యర్ధిగా ముత్తుముల అశోక్ రెడ్డి, ఇటు వైసీపీ అభ్యర్ధిగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగర్జునరెడ్డిలు అక్కడ పోటీ పడుతున్నారు.

- Advertisement -

గత రెండు సార్లుగా గిద్దలూరులో జెండా పాతిన వైసీపీకి ఈ సారి ఎదుగు గాలి విస్తోందన్న టాక్ వినపడుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన అన్నా రాంబాబు ఆ భయంతోనే వ్యూహాత్మకంగా మార్కాపురం ఫిఫ్ట్ అయి, అక్కడి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి గిద్దలూరు వచ్చేలా చేశారని అంటున్నారు. టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డి లోకల్ క్యాడెంట్ కావటంతో నియోజక ప్రజలు టీడీపీ వైపు మెగ్గు చూపుతున్నారట. వైసీపీ అభ్యర్ధి కుందురు నాగార్జున రెడ్డి నాన్ లోకల్ కావటం, వైసీపీకి మైనస్‌గా మారిందంటున్నారు. మరోవైపు వైసీపీలో అసంతృప్తి నేతలు టీడీపీకి జై కొడుతున్నారు. నాగార్జునరెడ్డి మార్కాపురం నుంచి రాజకీయ అవసరాల కోసం గిద్దలూరు వచ్చారని.. ఓడితే గిద్దలూరు వదిలి వెళ్తారని టీడీపీ అభ్యార్ధి అశోక్ రెడ్డి విమర్శిస్తున్నారు.. తను ఓడినా ,గెలిచినా గిద్దలూరులోనే ఉంటానని అశోక్ రెడ్డి చెప్పుకుంటున్నారు.

అశోక్ రెడ్డి చేస్తున్న కామెంట్స్‌కి వైసీపీ అభ్యర్ధి నాగార్జునరెడ్డి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గిద్దలూరులో వైసీపీ మళ్లీ వైసిపి జెండా ఎగరేయటం ఖయామని.. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమ వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నాగార్జునురెడ్డి అంటున్నారు. అయితే 2014 నుంచి 2019 తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో జరిగిన అభివృద్ది పనులే తనని గెలిపిస్తాయని టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డి అంటున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ది అంటూ టీడీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి గిద్దలూరు టీడీపీ టికెల్ ఆశించారు. టికెట్ దక్కకపోవటంతో ఆమె వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె టీడీపీ అధిష్టానం నుంచి ఏదో హామీ లభించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారంట. సాయికల్పన రెడ్డి, అశోక్‌రెడ్డికి స్వయన భందువు.. తనకు సీటు దక్కకపోతే ఇండిపెండెంట్‌గా పొటీ చేస్తానని చెప్పిన సాయికల్పన ప్రస్తుతం సైలైంట్ అయ్యారు. తను అనుచరులను అశోక్‌రెడ్డికి మద్దతుగా పనిచేయమని పురమాయించారంట. దాంతో అశోక్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సాయికల్పన గండం తప్పినట్లైంది.

మరోవైపు చీరాలకు చెందిన ఆమంచి స్వాములు జనసేన టికెట్‌తో గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పొటీ చేస్తానని కొన్ని రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. దానికి తోడు గిద్దలూరు టీడీపీలోని అసంతృప్తి నేతలు కూడా కూల్ అవ్వడం అశోక్ రెడ్డికి ప్లస్ పాయింట్‌గా కనపడుతోంది. కొమరోలు మండలానికి చెందిన వైసీపీ నేత కామూరు రమణారెడ్డి వైసీపీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవటంతో తన బంధువైన టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డికి మద్ధతుగా పనిచేస్తుండటం టీడీపీకి కలిసి వస్తుందంటున్నారు.

Also Read: సర్వేపల్లి కె.జి.ఎఫ్‌ క్లైమాక్స్ అదిరేనా?

అటు వైసీపీ అభ్యర్ధి కుందూరు నాగార్జునరెడ్డి నాన్ లోకల్ ఫీలింగ్‌ని పోగొట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులపైనే డిపెండ్ అయ్యారు. స్థానికంగా పలుకుబడి, సొంత వర్గం లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారాయి. అదీకాక వైసీపీలో పలువురు నేతలు లోపాయికారీగా టీడీపీకి సపర్ట్ చేస్తుండటంతో నాగార్జునరెడ్డి వర్గానికి కోవర్టుల భయం పట్టుకుందంట. కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ఖమెహన్‌రెడ్డి తెర వెనుక అన్ని కార్యకలాపాలు సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు రాక పొవడం వైసీపీని కంగరుపెడుతోందంట.

ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిద్దలూరు కొంత మంది టీడీపీ నాయకులకు గాలం వేయాలని చూస్తున్నా ఆయన కూడా నాన్ లోకల్ అవ్వడంతో ఏవీ ఫలించడం లేదంట. అర్ధవీడు మండలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగినా ఆ చేరికల వెనుక పెద్ద ఎత్తున్న నగదు చేతులు మారిందన్న గుసగుసలు వినపడుతన్నాయి. నియోజకవర్గంలో ఆరు మండలాల్లో పట్టు నిలబెట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది వైసీపీ కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండాలాలకు నాగార్జునరెడ్డి మామ, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసుల రెడ్డి ఇన్చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

మిగతా మూడు మండాలలో కొంత మంది నేతలను ఇన్ఛార్జులుగా నియమించారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అన్ని ప్రయోగాలూ చేస్తుంది. అయితే ఎంత ప్రయత్నించినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ధీమా టీడీపీలో కనిపిస్తుంది. చూడాలి మరి గిద్దలూరులో లోకల్, నాన్ లోకల్ ఫైట్ ఎవరికి కలిసి వస్తుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News