E-Paper
Advertisement

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి
Advertisement

Viral Video: సమాజంలో ఎన్నో రకాల విచిత్ర ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగానే జరుగుతున్న కూడా అందులో కొన్ని సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒకప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే బయట ప్రపంచానికి అసలు తెలిసేవే కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుండడం వల్ల ఎక్కడ ఏ ఘటన జరిగినా కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. చిన్న చిన్న సన్నివేశాలే అయినా కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మందుబాబులకు ఒక్కసారి మందు తాగితే అసలు ఏం చేస్తున్నారో కూడా అసలు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఒక్క పెగ్గు మందు వేయగానే శరీరంపై ఆలోచన లేకుండా పోతుంది. రోడ్లపై విన్యాసాలు చేయడం, చుట్టు ప్రక్కల వారిని ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కొన్ని సార్లు వారిపై దాడికి కూడా పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ మందుబాబు చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

అక్రమంగా మందును విక్రయించే వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలో అక్రమంగా మద్యాన్ని విక్రయించే వాటిని సీజ్ చేసి మొత్తం బుల్డోజర్, రోడ్డు రోలర్లతో తొక్కిస్తుంటారు. ఇలా తొక్కించి వాటిని స్మాష్ చేస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జరిగిన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ ప్రభుత్వ అధికారులు అక్రమంగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను తొక్కించేశారు. ఈ క్రమంలో వాటిని తొక్కిస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి కక్కుర్తికి పాల్పడ్డాడు. ఓ వైపు బాటిళ్లను తొక్కిస్తుండగా అందులో నుంచి రోడ్డుపై పారుతున్న మద్యాన్ని దోసిట్లో పట్టుకుని తాగేందుకు ప్రయత్నించాడు. ఈ తరుణంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారి ఆ వ్యక్తిని చూసి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ramesh Reddy Kaipu (@bhadradri_kurradu)

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×