BigTV English
Advertisement

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

Jani Master Case : ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ జానీ మాస్టర్ కేసు.. తన అసిస్టెంట్ ను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. గోవాలో పోలీసులు మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ ఉప్పర్ పల్లి కోర్టు లో హాజరు పరిచారు.. ఆయనకు సంబందించిన రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు కోర్టుకు అందజేశారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను లైంగిక దాడి చేసినట్లు ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా జానీ మాస్టార్ తిరుపతి లడ్డు సేవ్ చేసిందని వార్తలు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.


జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్..

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడు, అంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు.. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు కోర్టుకు అందించారు. ఆ రిపోర్ట్ లో ఆయన నేరం అంగీకరించారు. 2020వ సంవత్సరం లో జానీ మాస్టర్ బాధితురాలి మీద లైంగిక దాడి చేశాడని తొలిసారి జానీ మాస్టర్ బాధితురాలు మీద లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయసు పదహారేళ్ళని రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు.. 16 ఏళ్ల వయసు అమ్మాయి పై లైంగిక దాడి చెయ్యడంతో ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది.. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఎందరు బాధితులు బయటపడతారో చూడాలి..


Tirumala Laddu issue that saved Johnny Master
Tirumala Laddu issue that saved Johnny Master

జానీని కాపాడిన తిరుమల లడ్డు ..

ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అందజేస్తున్న లడ్డు ప్రసాదం కు ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ప్రసాదం రుచిని మరే లడ్డు మరిపించలేకపోయింది.. అలాంటి లడ్డు కల్తీ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా.. ప్రపంచదేశాలలో కూడా చాలా వివాదస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. అదే విధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా దుమారం రేపుతుంది. ఈ లడ్డు కల్తీ ఇస్యు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో జానీ మాస్టర్ కేసును జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మీడియా కూడా లడ్డు విషయం పైనే ఫోకస్ పెట్టింది. లేకుంటే ఇంత పెద్ద కేసును వదలడం సులువు కాదు.. మాస్టర్ ను తిరుమల లడ్డు కాపాడిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక జానీ మాస్టర్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి ..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×