BigTV English

Theft in High Speed Moving Lorry: ఇదెక్కడి మాస్ చోద్యంరా బాబు.. అచ్చం సినిమాల్లో లాగే హై స్పీడ్ లో వెళ్తున్న లారీలో చోరీ!

Theft in High Speed Moving Lorry: ఇదెక్కడి మాస్ చోద్యంరా బాబు..  అచ్చం సినిమాల్లో లాగే హై స్పీడ్ లో వెళ్తున్న లారీలో చోరీ!

Theft in High Speed Moving Lorry: తరచూ సినిమాల్లో ఫైటింగ్ లు, స్టంట్ లు వేయడం చూస్తుంటాం. వాటిని చూసి హీరో నిజంగా చేశాడా అని అనిపించేలా తీస్తారు డైరెక్టర్లు. అందులో సన్నివేశాలు చూసి చాలా మంది నిజ జీవితంలో ఇలా చేయాలంటూ కొన్ని సీన్లను ట్రై చేస్తుంటారు. ఈ తరహాలోనే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సినిమా పుష్పలోని సీన్లను నిజంగానే ట్రై చేశారు కొంత మంది జాదూగాళ్లు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిన తీరును చూసిన ఇన్పైర్ అయిన కొంత మంది దొంగల ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటనలు ఒకటి, రెండెంటి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఇలాంటిదే సినిమా స్టైల్‌లో జరిగిన ఓ దొంగతనం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.


అచ్చం సినిమా స్టైల్లోనే ఓ దొంగల ముఠా చేసిన దొంగతనం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కదులుతున్న వాహనంలో నుంచి భారీ దొంగతనానికి పాల్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఇంతటి సాహసాలు చేయడానికి దైర్యం సరిపోతుందా అనిపించేలా ఉంది ఈ ఘటన. అయితే ఓ జాతీయ రహదారిపై ఓ పెద్ద లారీ ఫుల్ లోడ్ తో వెళ్తుంది. దీనిపై కన్నెసిన ఓ దొంగల ముఠా లారీ పైకి ఎక్కి మరి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. షాజాపూర్ జిల్లాలోని ఆగ్రా, ముంబై జాతీయ రహదారిలో దేవాస్, షాజాపూర్ హైవే మార్గంలో ఓ లారీ భారీ లోడ్ చేసుకుని వెళ్తుంది.

లారీని చూసిన దొంగల ముఠా దానిని వెంబడించారు. వెంటనే ఇద్దరు దొంగలు లారీపైకి ఎక్కి అందులోని వస్తువులను దొంగిలించి రోడ్డుపై పడేశారు. అనంతరం మూడో వ్యక్తి బైక్ పై లారీని వెంబడించగా.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు కదులుతున్న లారీ నుంచే దిగుతూ బైక్ పైకి ఎక్కేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను వెనుక వస్తున్న ఓ కారులోని వ్యక్తులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనను డ్రైవర్ గమనించకపోవడంతో దొంగల ముఠా సాఫీగా దొంగతనం చేసుకుని వెనుదిరిగారు.


Also Read: Shocking Video: దేవుడా.. ఆఖరికి అక్కడ కూడా నా.. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. వీడియో చూశారా..

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×