E-Paper
Advertisement

Car Fire Accident: నేషనల్ హైవేపై కారులో మంటలు.. వెంటనే బయటకు దూకడంతో..?

Car Fire Accident: నేషనల్ హైవేపై కారులో మంటలు.. వెంటనే బయటకు దూకడంతో..?
Advertisement

Car Fire Accident: హైదరాబాద్‌–కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఉన్న అలుగునూరు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మారుతి (800) కారులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. కారు నడుస్తున్నప్పుడే ముందు భాగం నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. క్షణాల్లోనే మంటలు కారును పూర్తిగా చుట్టుముట్టడంతో లోపల ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అయితే.. పరిస్థితిని గమనించిన కారులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై వాహనం నుంచి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారు మాత్రం నడిరోడ్డుపైనే పూర్తిగా తగలబడిపోయింది. మంటలు తీవ్రంగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో రహదారిపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు భయంతో అక్కడే ఆగిపోయారు.

Advertisement

ఈ ప్రమాద కారణంగా హైదరాబాద్‌–కరీంనగర్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపు చేశారు. అనంతరం పూర్తిగా కాలిపోయిన కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమంగా పునరుద్ధరించారు. ఈ ఘటనతో వాహనాల్లో సాంకేతిక లోపాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సమయానికి స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయిందని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement

ALSO READ: మాజీ ఐపీఎస్ అధికారి దంపతులకు సైబర్ టోకరా.. ఏకంగా రూ. 2.58 కోట్లు స్వాహా!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×