BigTV English

Alekhya Chitti Pickles : అక్కను పక్కన పెట్టి… రమ్య పికిల్స్.. వీళ్లు మళ్లీ వచ్చేశారు.. ధర తక్కువంటా…

Alekhya Chitti Pickles : అక్కను పక్కన పెట్టి… రమ్య పికిల్స్.. వీళ్లు మళ్లీ వచ్చేశారు.. ధర తక్కువంటా…

Alekhya Chitti Pickles : అలేఖ్య చిట్టి పికెల్స్.. అటు సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తండ్రి మరణం తర్వాత.. ఈ పచ్చళ్ళ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తూ.. భారీగా విజయాన్ని అందుకున్నారు. బిజినెస్ మొదలుపెట్టిన ఏడాదిలోపే ఊహించని లాభాలను సొంతం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా వీరి బిజినెస్ కి దిష్టి తగిలిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా అలేఖ్య సిస్టర్స్ అలేఖ్య కస్టమర్ తో మాట్లాడిన మాటలతో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. ధరలు ఎక్కువ అన్నందుకు సదరు కస్టమర్ వ్యక్తిగత విషయాలపై అలేఖ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని.. సెలబ్రిటీల వరకు అలేఖ్య మాట్లాడిన ఆడియోని తమ ప్రమోషన్స్ కోసం కూడా వాడుకొని.. పెద్ద ఎత్తున వైరల్ చేసిన విషయం తెలిసిందే. దెబ్బకు అలేఖ్య చిట్టి పికెల్స్ బిజినెస్ పడిపోయింది. అటు అలేఖ్య కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఐసీయూలో చేరింది.


అలేఖ్య చిట్టి పికెల్స్ కాదు.. రమ్య మోక్ష పికెల్స్..

దాదాపు బిజినెస్ క్లోజ్ అయిపోయింది. ఇక ఈ అక్కాచెల్లెళ్ళ పరిస్థితి అంతే అనుకునే లోపే మళ్ళీ అలేఖ్యను పక్కనపెట్టి చెల్లి రమ్య తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోని వదులుతూ.. మా అక్కను పూర్తిగా పక్కన పెట్టేసి, మేము మళ్ళీ ‘రమ్య మోక్ష పికెల్స్’ తో మీ ముందుకు వస్తామంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో రమ్య మాట్లాడుతూ.. “మేమైతే ఈ 11 నెలలలో మా ఈ బిజినెస్ ద్వారా బాగా సక్సెస్ అయ్యాము. కానీ 11 నెలల్లోనే ఈ ఇష్యూ వల్ల మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఇక అఫీషియల్ గా అయితే మా బిజినెస్ క్లోజ్ అయింది. దీంతో నెక్స్ట్ ఏంటి ? అనే డైలామాలో పడ్డాము. అందుకే అలేఖ్య చిట్టి పికెల్స్ తీసేసి ‘రమ్య మోక్ష పికెల్స్’తో చాలా స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇద్దామని అనుకుంటున్నాము.


ధరలు తక్కువ.. ఆదరించండి అంటున్న రమ్య..

అయితే ఇదివరకు ఉన్న సపోర్టు ఇప్పుడు ఉంటుందా అనే నమ్మకం నాకు లేదు. కానీ ఎక్కడో హోప్ ఉంది. మా నుంచి పికెల్స్ రుచి చేసిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి అని సపోర్ట్ చేస్తున్నారు. నేను పెట్టే రమ్య మోక్ష పికిల్స్ అందరూ కొనగలిగే ధరలలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ మీ ముందుకు గట్టిగా కం బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కస్టమర్ తో మాట్లాడడానికి ఒక వ్యక్తిని కూడా నియమిస్తాము. ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఇకపై అక్క అలేఖ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండా.. ఈసారి పూర్తి బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మొదట మా నాన్న ఉన్నప్పుడు ఆ బిజినెస్ కి కూడా రమ్య మోక్ష పికెల్స్ అని పెడదాం అనుకున్నాము. కానీ అప్పుడు నేను సినిమాల్లో ఉండడం వల్ల నా పేరు మీద బాగుండదు అని..మా అక్క పేరుమీద అలేఖ్య చిట్టి పికెల్స్ అని పెట్టాము. ఇకపోతే నాన్న మరణించిన తర్వాత ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాము. ఇప్పుడు నా చెల్లి , తల్లిని నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇకపై రమ్య మోక్ష పికెల్స్ అంటూ మీ ముందుకు వస్తానుదయచేసి ఆదరించండి” అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది అలేఖ్య సిస్టర్ రమ్య. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అక్కను పక్కన పెట్టేసి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు.. అయితే ఈసారి ధరలు తక్కువ అంటున్నారు.. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు? అని ఒకరు కామెంట్ చేస్తే.. మరి కొందరు డబ్బు రుచి చూసాక బిజినెస్ మానుకుంటారా? అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Related News

Viral Video: పొంగిపొర్లే నదిలో డేంజర్ స్టంట్, వరద ధాటికి జీప్ పల్టీ, సీన్ కట్ చేస్తే..

Viral Video: మెట్రో స్టేషన్ లో షాక్.. యెల్లో లైన్‌ దాటిన సెక్యూరిటీ.. అదే సమయంలో!

Pakistan Woman: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!

Arunachal pradesh: అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. వాహనాలు వెనక్కి, జస్ట్ మిస్ లేకుంటే

China Delivery Man: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..

Heavy rains: వర్షం బీభత్సం.. 2 కిమీల మేర ఏర్పడిన భారీ గుంత.. వీడియో వైరల్

Big Stories

×