Rain Alert: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం పడుతోంది. అమీర్ పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, యూసుఫ్ గూడ్, కృష్ణానగర్, మియాపూర్, నానక్ రాం గూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
కోఠి, దిల్‌సుఖ్ నగర్, అంబర్ పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, గాంధీభవన్ పరిస్థిత ప్రాంతాలు, అబిడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో సాధారణ వర్షం పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్రనగర్ చుట్ట పక్కల ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. ఆఫీస్ లు ముగిసే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అటు సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది.
అత్యధికంగా బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్ పురాలో 7.8 సెంటీ మీటర్ల వర్షపాతం, నాంపల్లి లో ఏడు సెంటీమీటర్లు వర్షపాతం, చార్మినార్ లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం, అంబర్‌పేట్ లో 5 సెంటీమీటర్ల వర్షపాతం, ఖైరతాబాద్ లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మహా నగరంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా వీచే అవకాశముందని పేర్కొన్నారు.
అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు.
Also Read: TGCAB: తెలంగాణ టీజీసీఏబీలో పోస్టులు.. ఈ అర్హత ఉంటే చాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.97,620