BigTV English

Naveen Chandra: ఇండస్ట్రీలో నవీన్ చంద్రని వాడుకోవడం తెలీలా.. రాకేష్ కామెంట్స్ వైరల్..!

Naveen Chandra: ఇండస్ట్రీలో నవీన్ చంద్రని వాడుకోవడం తెలీలా.. రాకేష్ కామెంట్స్ వైరల్..!

Naveen Chandra: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తెలుగు, తమిళ సినిమాలలో వరుసగా నటిస్తున్నారు. సహజమైన నటనతో, డిఫరెంట్ పాత్రను ఎంచుకోవడంతో, నవీన్ చంద్ర టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో అందాల రాక్షసి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. 2017 లో వచ్చిన నేను లోకల్ అనే సినిమాలో నెగిటివ్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత వరుసగా నవీన్ చంద్రకు ఆఫర్లు క్యూ కట్టాయి. అటు సినిమాలను చేస్తూ,ఇటు వెబ్ సిరీస్ లోను, సత్తా చాటారు నవీన్ చంద్ర. అయితే ఆయనకు సోలో హీరో గా చేసిన సినిమాలు తక్కువ. ఇప్పుడు బ్లైండ్ స్పాట్ అనే మూవీ ద్వారా సోలో హీరోగా మన ముందుకు రానున్నారు. తాజాగా జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో, దర్శకుడు రాకేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవీన్ చంద్ర గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.


 అయన చాలా గ్రేట్..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ రాకేష్ వర్మ ‘బ్లైండ్ స్పాట్’ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ వీరపనేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో,దర్శకుడు నవీన్ చంద్ర గురించి మాట్లాడుతూ.. ‘నవీన్ చంద్ర చాలా టాలెంటెడ్ హీరో, ఫస్ట్ డే నేను ఆయనకి షార్ట్ చెప్పినప్పుడు, ఆయన డైరెక్ట్ గా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి కార్వాన్ దగ్గరికి వెళ్లడం రిలాక్స్ అవడం మళ్ళీ షూట్ లోకి రావడం యాక్టింగ్ చేయడం, ఇలా జరుగుతూ ఉంది నేను చూసి, ఏంటి ఇంత సీరియస్ గా ఉన్నారు అని అనుకున్నాను. రెండు మూడు రోజులు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన సినిమాలో ఉన్న పాత్రలో లీనమై, సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు. స్టోరీ చెప్పినప్పటినుండి సినిమా పూర్తయ్యేంతవరకు ఆయన అసలు నవ్వనే లేదు. క్యారెక్టర్ లో ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత జోక్ వేసినా కూడా నవ్వలేదు. మా మూవీ మొత్తం ఒక సింగిల్ లైఫ్ లో జరుగుతుంది ఆ కంటిన్యూటీ మెయింటినెన్స్ చేయడమే చాలా కష్టం. కానీ ఆయన అర్థం చేసుకొని, షూటింగ్ మొత్తం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరితో మాట్లాడకుండా, అంత డెప్త్ గా చేయడం చాలా గ్రేట్. నేను బాగా ఆయనను అబ్జర్వ్ చేస్తే, చాలామంది యాక్టర్స్ తో పోలిస్తే నవీన్ చంద్ర యాక్టింగ్ పై చూపే ఇంట్రెస్ట్ ఆ పాత్ర పై ఉండే ప్రేమ, బాధ్యత మనకి కనిపిస్తాయి ఇలాంటి హీరోని ఎవరు సరిగ్గా వాడుకోలేదని, ఇప్పటివరకు ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు అన్నది నా అభిప్రాయం’ అని రాకేష్ వర్మ తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో ఇండస్ట్రీలో వైరల్ అయింది. వీడియోని చూసిన వారంతా నవీన్ చంద్ర యాక్టింగ్ గురించి దర్శకుడు మాట్లాడిన మాటలు నిజమని ఆయనకు మంచి క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తారని అభిమానులు అంటున్నారు.


సస్పెన్స్ థ్రిల్లర్..

ఇక సినిమా విషయానికి వస్తే బ్లైండ్ స్పాట్ సినిమా, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు రానుంది. ట్రైలర్ లో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసే  పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్ర కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతాన్ని మద్దూరి శ్రీరామ్ అందిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలోరాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవివర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నవీన్ చంద్ర కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులతో పాటు మనము కోరుకుందాం.

Jr NTR : హమ్మయ్య మొత్తానికి తిరిగొచ్చాడు… ఇక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్సే

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×