BigTV English
Advertisement

Alekhya Chitti : మా చెల్లెమ్మ జోలికి వస్తే బాగోదు.. మీమర్స్ పై రెచ్చిపోయిన సుమక్క..

Alekhya Chitti : మా చెల్లెమ్మ జోలికి వస్తే బాగోదు.. మీమర్స్ పై రెచ్చిపోయిన సుమక్క..

Alekhya Chitti : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పీకేల్స్.. గోదారి జిల్లాలో అలేఖ్య చిట్టి పీకేల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. పలు రకాల నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తున్నారు.. వీళ్ళ పచ్చళ్ళు ఎంత ఫేమస్సో.. వీళ్లు కూడా ఆ ప్రాంతంలో అంతే ఫేమస్.. ఈమధ్య ఓ కస్టమర్ అంతెందుకు అన్నందుకు సోషల్ మీడియాలో వాళ్ళు బూతులు తిట్టిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ పేరు మార్మోగిపోయింది. మా తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పినా కూడా వీరిపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అంటూ వార్తలు వినిపించాయి. దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అలాగే మరోసారి వీరిపై మీమ్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా ట్రోల్స్ పై అలేఖ్య సిస్టర్ సుమ స్పందించింది. మీమర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆమె ఏమన్నారో ఒకసారి చూసేద్దాం..


సినిమాల్లోకి రమ్య ఎంట్రీ..?

మొన్నటివరకు పచ్చళ్ళ గోల ఎక్కువగా ఉండేది.. ఇప్పుడేమో సోషల్ మీడియాలో క్రేజ్ రావడంతోనే రమ్యకు సినిమా ఆఫర్స్ వచ్చిందని ఓ వార్త ప్రచారంలో ఉంది. వీళ్లు తయారు చేస్తున్న పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో అలేఖ్య చిట్టి పికెల్స్‌ సిస్టర్స్‌ ఒక్కసారిగా జనం నోళ్లలో నానారు.. నెగెటివ్‌ ప్రచారం వ్యాపారాన్ని దెబ్బతీసినా వారికి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ మాత్రం అమాంతం పెరిగింది. ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య తాజాగా సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘వచ్చినవాడు గౌతమ్‌’ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమంలో సందడి చేసింది. అయితే రమ్య ఈ సినిమాలో నటించిన అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. మరి హీరోయిన్గా నటించిందా? లేదా సైడ్ రోల్ చేసిందా? అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం నెటిజన్ల నోట్లో రమ్య పేరు నాన్తుంది.. ఇక సుమపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read :లగ్జరీ విల్లా కొన్న రోహిణి.. స్టార్స్ పనికిరారు.. ఎన్ని కోట్లో తెలుసా..?

మీమ్స్ పై స్పందించిన సుమ.. 

అలేఖ్య సిస్టర్స్ లలో ఒకరైన సుమ గురించి అందరికీ తెలుసు. పచ్చళ్ళు వివాదం ముదిరినప్పుడు ఈమె సోషల్ మీడియా ద్వారా వివరణ ఇస్తూ వచ్చింది. తాజాగా తన చెల్లిపై మీమ్స్ రావడంతో మరోసారి వీడియోను రిలీజ్ చేసింది. మా చెల్లి జోలికొస్తే మర్యాదగా ఉండదు. అసలు మా చెల్లెలు అనడానికి మీరెవరు మీకు ఏం తెలుసని మా చెల్లెల్ని అంటున్నారు అంటూ రెచ్చిపోయింది. పచ్చల ధర గురించి వచ్చిన వివాదం కన్నా ముందే రమ్యకు సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్పుడే ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వార్తలు వల్ల ఆమె ఫేమస్ అయ్యి సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అంటూ మీమర్స్ కి ట్రోలర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీనిపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×