India’s Longest Passenger Ropeway: చాలా మంది సమ్మర్ లో హిల్ స్టేషన్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. దేశంలోని చాలా హిల్ స్టేషన్స్ లో రోప్ వేలు పర్యాటకులకు మరింత ఎంజాయ్ మెంట్ ను అందిస్తున్నాయి. ఈ రోప్ వేలో ఆకాశంలో విహరిస్తూ అద్భుతమైన అనుభూతిని పొందుతారు. దేశంలో పలు ప్రాంతాల్లో రోప్ వేలు ఉన్నప్పటికీ, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డెహ్రాడూన్- ముస్సోరీ రోప్ వే. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రోప్ వేగా రూపొందబోతోంది. ముస్సోరీ స్కై కార్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలోనే అతి పొడవైన ప్యాసింజర్ రోప్ వే ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. రూ. 300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2023లో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించింది.
2026లో అందుబాటులోకి రోప్ వే సేవలు
డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ రోప్ వే సుమారు 5.2 కిలో మీటర్ల పొడవున ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 2026లో ఈ రోప్ వే టూరిస్టులకు అందుబాటులోకి రానుంది. మోనోకేబుల్ డిటాచబుల్ గొండోలా వ్యవస్థ 1,000 మీటర్లు ఎత్తులో ప్రయాణించనుంది. డెహ్రాడూన్- ముస్సోరీ ప్రాంతాలను ఈ రోప్ వే కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల నడుమ రోడ్డు మార్గం 33 కిలో మీటర్లు ఉంటుంది. సుమారు 2 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ, ఈ రోప్ వే కారణంగా 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.
పకడ్బందీగా భద్రతా చర్యలు
ఇక ఈ రోప్‌వే FIL ఇండస్ట్రీస్, SRM ఇంజనీరింగ్, ఫ్రాన్స్‌కు చెందిన POMA SAS కలిపి జాయింట్ వెంచర్ గా నిర్మిస్తున్నారు. వాటర్ ప్రూఫ్ గొండోలా రైడ్ పూర్తిగా కరెంట్ తో నడుస్తుంది. ఏడాది పొడవునా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. యూరోపియన్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మిస్తున్నారు. యూరోపియన్ భద్రతా ప్రమాణాల (CEN) ప్రకారం ధృవీకరించబడిన రోప్ వే వ్యవస్థ భద్రతను నిర్ధారించడానికి తరచుగా తనిఖీలు నిర్వహిస్తారు. డెహ్రాడూన్ అందాలను 20 నిమిషాల పాటు గగనతలం నుంచి చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
Read Also: దేశంలో అత్యంత పొడవైన వందే భారత్ స్లీపర్ జర్నీ.. అదీ తెలుగు రాష్ట్రాల మీదుగా!
గంటకు 1300 మంది ప్రయాణం
ఈ రోప్ వే గంటకు ప్రతి దిశలో సుమారు 1,300 మంది ప్రయాణీకులనుకు తీసుకెళ్తుంది. లగ్జరీ కేబుల్ కార్లు సౌకర్యం ఉంటుంది. వీటికి ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఇవి 10 సీట్ల డైమండ్ క్యాబిన్లను కలిగి ఉంటాయి. తగినంత వెంటిలేషన్‌ను కలిగి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ గొండోలా రైడ్ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా రూపొందించారు. పర్యావరణాన్ని కాపాడేలా జీరో పర్సెట్ కర్బన ఉద్గారాలతో రన్ అవుతాయి. ఇప్పటికే ఈ రోప్ వే పనులు ప్రారంభ కాగా, వచ్చే ఏడాది చివరి వరకు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!